వరద బాధితులకు ఎమ్మెల్యే విరాళం

9/9/2024 10:12:42 PM

ఎల్ఎన్ పేట: ఎక్స్ ప్రెస్ న్యూస్: సెప్టెంబర్ 09:
పాతపట్నం నియోజకవర్గ శాసనసభ్యులు మామిడి గోవిందరావు ఇటీవల కాలంలో విజయవాడ కృష్ణ, బుడమేరు వరద బాధితులకు ముఖ్యమంత్రి సహాయ నిధికి ఎంజీఆర్ భారీ విరాళం ఇచ్చారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో పాతపట్నం నియోజకవర్గం  శాసనసభ్యులు మామిడి గోవింద రావు వరద బాధితులకు బాసటగా 10 లక్షలు రూపాయలు చేయూతనందించారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు అతలాకుతలమైన విజయవాడ మహా నగర ప్రజలకు బాసటగా ముఖ్యమంత్రి సహాయ నిధికి తన వంతు ₹10,00,000/- రూపాయిల చెక్ ను సోమవారం విజయవాడలో ముఖ్యమంత్రి  నారా చంద్రబాబు నాయుడు కి  మామిడి గోవింద రావు అందజేశారు.

Name*
Email*
Comment*