మావో చిరస్మరణీయుడు

9/9/2024 10:15:02 PM

సోంపేట: ఎక్స్ ప్రెస్ న్యూస్: సెప్టెంబర్ 9 :
కామ్రేడ్ మావో 48 వ వర్ధంతి సభ సోమవారం పలాస మండలం తర్ల కోట పంచాయతీ కొఠారింగి గ్రామం లో జరిగింది. ఈ సందర్బంగా  మావో చిరస్మరణీయుడని ప్రపంచ విప్లవాల వేగుచుక్క అని సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి వంకల మాధవరావు గుర్తు చేశారు. ఆయన మాట్లాడుతూ మార్క్సి జం లెనిన్ నిజం ,మావో ఆలోచన విధానం ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలకు దిక్సూచిగా మారాయి అన్నారు. వ్యవసాయక దేశాలలో విప్లవాన్ని ఎలా తీసుకురావాలన్నది బాబు ఆలోచన తెలియజేస్తుంది. రైతాంగాన్ని విప్లవానికి ఎలా సంసిద్ధత చేయాలో మావో రచనల ద్వారా మనం చూడవచ్చని , మావో ఆచరించి చైనా లో సాయుధ పోరాటం నడిపి గేరిల్లా యుద్ధం చేసి విప్లవాన్ని విజయవంతం చేశారని అన్నారు.  భారతదేశంలోని వెనకబడ్డ వ్యవసాయ దేశాల్లో అర్ధ వలస అర్ధ భూస్వామ్య స్వభావం కలిగిన ఈ దేశానికి వ్యవసాయక విప్లవమే పరిష్కార మార్గం అని మాధవరావు తెలిపారు. నూతన ప్రజాస్వామ్యక విప్లవం విజయవంతం చేయడం ద్వారానే కామ్రేడ్ మావుకి నివాళులర్పించిన వాళ్ళు అవుతాం మావో ఆశయాలను సాధిద్దాం. ఈ కార్యక్రమంలో ఐఎఫ్టియు జిల్లా కన్వీనర్ జుత్తు వీరాస్వామి, సవర సోమేశ్వరరావు, సవర బంగ్లా కుమార్ పాల్గొన్నారు.

Name*
Email*
Comment*