ఎల్ఎన్ పేట: ఎక్స్ ప్రెస్ న్యూస్: సెప్టెంబర్ 09:
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్ప పీడనం కారణంగా శ్రీకాకుళం జిల్లాలో విస్తారంగా వర్షాలు కురవడంతో వంశధార నదికి వరదలు వచ్చే అవకాశం ఉన్నందున గొట్టా బ్యారేజ్ ని పాతపట్నం నియోజకవర్గ భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు సిరిపురం తేజేశ్వరరావు సందర్శించారు. ఒడిస్సా క్యాచ్ మెంట్ ఏరియాలో అధిక శాతం వర్షాలు కురవడంతో వంశధార నదికి వరద నీరు పోటెత్తడంతో వంశధార నది పరివాహక గ్రామాలకు వరద నీరు వచ్చే ప్రమాదం ఉందని తెలుసుకున్నారు. లోతట్టు ప్రాంతాల్లో నివసిస్తున్న ఆయా గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఎప్పుడు ఏ అవసరం వచ్చినా సంబంధిత అధికారులను వెంటనే సంప్రదించాలని ప్రజలను కోరారు. నదీ పరివాహక గ్రామాలను ఎప్పటికప్పుడు సందర్శించి, ప్రజలను చైతన్య పరచాలని అధికారులను కూడా కోరారు. గొట్టా బ్యారేజీ నీటి ప్రవాహాన్ని గమనించి బ్యారేజ్ లో సిల్ట్, గుర్రపు డెక్క అధిక శాతంలో డిపాజిట్ కావడంతో స్టోరేజీ కెపాసిటీ లేకపోవడం వలన ఎప్పుడు వచ్చిన వరద నీరు అప్పుడే సముద్రంలోకి విడిచిపెడుతున్నారని సిల్ట్, గుర్రపు డెక్క మొత్తాన్ని తొలగిస్తే డెప్త్ పెరిగి స్టోరేజీ పెరుగుతుందని సూచించారు. గత వేసవిలో చూసినప్పుడు బ్యారేజీ లో పూర్తిగా నీరు లేకపోయినా సందర్భంలో కిలోమీటర్ దూరం వరకు సిల్ట్, గుర్రపు డెక్క డిపాజిట్ అయి ఉండటం వలన బ్యారేజ్ డెప్త్ లేకపోవడం గమనించినట్లు తెలిపారు. సిల్ట్, గుర్రపు డెక్క పూర్తిగా తొలగించడం వలన బ్యారేజ్ డెప్త్ పెరిగి ఆ నీటిని రానున్న వేసవి లో త్రాగు, సాగు నీటి అవసరాల కొరకు ఆ నీటిని వినియోగించుకోవచ్చని సూచించారు.