నిలకడగానే ' వంశధార '

9/9/2024 10:20:47 PM

హిరమండలం: ఎక్స్ ప్రెస్ న్యూస్: సెప్టెంబర్ 9:   
రెండు రోజులుగా  కురుస్తున్న  భారీ వర్షాలకు వంశధారలో నీటి ప్రవాహం నిలకడగానే కొనసాగుతోంది. గొట్టాబ్యారేజీ వద్ద సోమవారం సాయంత్రం 5 గంటల సమయంలో ప్రాజెక్టు ఇన్ ఫ్లో 10,193 క్యూసెక్కులుగా ఉందని డీఈ    రంగనాయకులు తెలిపారు. మండలంలోని గ్రామాల్లో పరిస్థితిని ఆర్డీవో తో పాటు ప్రత్యేక అధికారి, తహశీల్దార్ ఇతర అధికారులు.. ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండి పరిశీలిస్తూ, సిబ్బందికి ప్రజలకు సూచనలు ఇస్తున్నారు.
కాగా సోమవారం మధ్యాహ్నం నుంచి  వర్షం పడలేదు. వాతావరణం కాస్త తెరిపిచ్చినట్లు కనిపించింది.

Name*
Email*
Comment*