వాయు గుండం పై ప్రత్యేక ఏర్పాట్లు

9/9/2024 10:26:18 PM

కంచిలి: ఎక్స్ ప్రెస్ న్యూస్: సెప్టెంబర్ 9:
మండలంలో పడిన భారీ వర్షాల కారణంగా కంచిలి మండల పరిషత్ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ను మండల ప్రత్యేకాధికారి జి. రఘునాథ్ ఏర్పాటు చేసారు. అసిస్టంట్ డైరెక్టర్(అనిమల్ హస్బెండరీ) పరిశీలించి కంచిలి మెయిన్ రోడ్, పెట్రోల్ బంక్ వద్ద రహదారి పై చెట్టు కొమ్మలు పడి ఉన్న ప్రాంతాన్ని పరిశీలించి ప్రజా రవాణాకు అంతరం లేకుండా చూడాలని, భైరిపురం జంక్షన్ వద్ద వరద నీరు రోడ్డు పై నిలిచి ఉన్న ప్రాంతాన్ని పరిశీలించి, డ్రైనేజ్ స్లిట్ ఓపెన్ చేయించి నీటిని వదిలేలా చర్యలు తీసుకొని యం.యస్. పల్లి గ్రామపంచాయతీ పరిధిలో గల నారాయణ బట్టి గ్రామము వద్ద రహదారి పై వరద నీటి పరిశీలించి ఆర్&బి అధికారులతో మాట్లాడి చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు. అనంతరం బురాగం గ్రామ సచివాలయంను తనిఖీ చేసి పారిశుధ్య పనులు నిర్వహించాలని ఆదేశించారు. ఈ పర్యాటన లో యం.పి.డి. ఓ. వి రజిని మండల విద్యాశాఖాధికారులు  సప్ప శివ రాంప్రసాద్ చిట్టిబాబు , మండల వ్యవసాయాధికారి ధనంజయం  పాల్గొన్నారు.

Name*
Email*
Comment*