24 గంటలు సహాయక చర్యలు

9/9/2024 10:35:00 PM

 రణస్థలం: ఎక్స్ ప్రెస్ న్యూస్: సెప్టెంబర్: 9 
భారీ వర్షాలు నేపథ్యంలో పంచాయతీల్లో 24 గంటలు సహాయక చర్యలు చేపడుతున్నారు. కోస్టా పంచాయతీలో పంచాయతీ కార్యదర్శి ఆర్. శ్రీధర్ ఆధ్వర్యంలో సచివాలయం వైద్య సిబ్బంది, అంగనవాడి విధులు నిర్వహిస్తున్నారు. ఆదివారం ప్రత్యేక మెడికల్ క్యాంపు నిర్వహించి వైద్య సేవలు అందించారు. విపత్తు సమయాల్లో విధులు నిర్వహణలో భాగంగా ఎం.పీ.డీ.వో .ఆర్ .వి. రమణమూర్తి ఆదేశాల మేరకు 24 గంటలు కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామని తెలియపరిచారు.

Name*
Email*
Comment*