కంచిలి: ఎక్స్ ప్రెస్ న్యూస్: సెప్టెంబర్ 9:
బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం పూరి సమీపంలో తీరం దాటుతున్న నేపథ్యంలో ఇచ్చాపురం నియోజకవర్గం లో భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరిక నేపథ్యంలో ఇచ్చాపురం నియోజకవర్గం ఎమ్మెల్యే బెందాలం అశోక్ బాబు సుడిగాలి పర్యటన చేశారు. కంచిలి మండలం లోని తహసిల్దార్ కార్యాలయంలో అధికారులతో సమీక్షలు నిర్వహించి తగు సూచనలు చేయడం జరిగింది. భారీ వర్షాలు పడే నేపథ్యంలో వరదలు అనంతరం పంట నష్టం అంచనాలను త్వరితిగతిన చేపట్టి రైతులను ఆదుకునే విధంగా చర్యలు చేపట్టాలని సూచించారు.ఆరోగ్య సిబ్బంది ఆస్పత్రిలో అప్రమత్తంగా వ్యవహరించి వ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకోవాలని తెలిపారు. పంచాయతీ సిబ్బంది సానిటేషన్ క్లోరినేషన్ వంటి చర్యలను చేపట్టి వర్షాల అనంతరం రాబోవు తీవ్ర పరిణామాలు గ్రహించి అందుకు అనుగుణంగా ప్రణాళికను సిద్ధం చేసుకుని ప్రజారోగ్యాల పట్ల బాధ్యతగా వ్యవహరించాలని ఆదేశాలు జారీ చేశారు. కంచిలి ప్రధాని రహదారిలో నీరు నిల్చుపోవడంతో పంచాయతీ కార్యదర్శి పై ఆగ్రహం వ్యక్తం చేశారు. నిల్వ ఉన్న మీరు పక్కనే ఉన్న ఎస్వీ వీధిలోకి వెళ్లకుండా తగు చర్యలు చేపట్టాలని ఆదేశాలు జారీ చేశారు. తహసిల్దార్ జయలక్ష్మి ఎంపీడీవో నీరజ వ్యవసాయ అధికారులను ధనుంజయరావు ఉప తహసిల్దార్ దట్టి సంతోషులతోపాటు తెదేపా నాయకులు జగదీష్ పట్నాయక్ మాదిని రామారావు తదితరులు పాల్గొన్నారు.