సోంపేట: ఎక్స్ ప్రెస్ న్యూస్: సెప్టెంబర్ 9:
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం పూరి వద్ద సోమవారం తీరం దాటుతున్న నేపథ్యంలో తుఫాను పరిస్థితులపై ఇచ్చాపురం ఎమ్మెల్యే డాక్టర్ బెందాళం అశోక్ సోంపేట తహశీల్దార్ కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో సోమవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని శాఖలు సమన్వయంతో సమస్యలు ఎక్కడకక్కడే పరిష్కరించాలని సూచించారు. తహశీల్దార్ కార్యాలయం పక్కనే ఉన్న ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల రహదారి మొత్తం చెరువును తలపించేలా ఉందని, వర్షం నీరు డ్రైనేజీల ద్వారా పోలీసు చౄరువుకు వెళ్లేదని ఈ ప్రాంతం అక్రమణలకు గురి కావడంతో ఇక్కడ సమస్య ఏర్పడిందని ,తక్షణమే వర్షం నీటిని బయటకు వెళ్లేలా చర్యలు తీసుకోవాలని పంచాయతీ పాలకవర్గం, మండల అధికారులను ఆదేశించారు. వర్షాలు కారణంగా గ్రామీణ ప్రాంతాలకు వెళ్లి రహదారులు పరిశీలించాలని, పారిశుధ్యం క్లోరినేషన్ వంటి చర్యలు తీసుకోవాలని సూచించారు.మత్స్యకార ప్రాంతాల్లో తుఫాను ప్రభావాన్ని అంచనా వేయాలని టిడిపి రాష్ట్ర కార్యదర్శి సూరాడ చంద్రమోహన్, మాజీ ఎంపిపి చిత్రాడ శ్రీనివాస్ ఇతర నాయకులకు సూచించారు. పారిశుధ్యం పై సర్పంచులు సత్వరమే స్పందించకపోతే ఆయా ప్రాంతాల్లో ఉన్న టిడిపి నేతలు జోక్యం చేసుకుని ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సోంపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ మంగరాజు , తహశీల్దార్ బి అప్పలస్వామి, బిరీ సర్వేయర్ గౌరీ శంకర్ , వివిధ శాఖల అధికారులు బారువ ,సోంపేట ఎస్సైలు చంద్రశేఖర్ సిబ్బంది పాల్గొన్నారు. అనంతరం బాతుపురం వద్ద పైడిగాం మెయిన్ ఛానెల్ అధికారులు పరిశీలించారు. ఎగువు నుంచి వచ్చే వరద నీటి పరిస్థితి ని అంచనా వేసారు.