అన్నింటా " బంగార " (రు) మే !

9/9/2024 10:43:04 PM

ఓవైపు జాననదం ,మరోవైపు సమాజహితం ! 

జానపద పాటలుతో ఆకట్టుకుంటున్న కొర్లాం యువకుడు !

సోంపేట: ఎక్స్ ప్రెస్ న్యూస్: సెప్టెంబర్ 9
సోంపేట మండలం బ్రాహ్మణకొర్లాం  గ్రామానికి చెందిన బంగారు రాజు అనే యువకుడు డిగ్రీ పూర్తి చేసి జానపద గీతాలు ,సాంస్కృతిక కార్యక్రమాలు పై ధృష్టి సారించాడు , ఓ వైపు  తనకు చిన్నప్పటి నుంచి అత్యంత ప్రియమైన జానపద  పాటలను  తానే స్వయంగా రాసి పాడుతూ ,మరోవైపు మొక్కలు నాటుతూ పర్యావరణానికి మేలు చేస్తున్నాడు. బంగారోడు అనే జానపద పాటకు   మధురమైన గాత్రం తో ఆకట్టుకుంటున్నాడు .ప్రస్తుతం ఈ పాట సామాజిక మాధ్యమాల్లో శ్రోతలను విశేషంగా ఆకట్టుకుంది. కొర్లాం హుకుంపేట లో ప్రభుత్వ బడిలో ఐదో తరగతి వరకు చదువుకున్న ఈ యువకుడు  6 నుంచి 10వ తరగతి వరకు కొర్లాం ప్రభుత్వ పాఠశాలలో చదివాడు.  ఇంటర్మీడియట్ పక్కనే ఉన్న బాలకృష్ణ జూనియర్ కళాశాలలో ,హరిపురం శ్రీ కుమార్ కళాశాలలో డిగ్రీ వరకు చదువుకున్న ఈ కుర్రాడు, చిన్నప్పుడు అమ్మా నాన్నలు చిన్న చిన్న పాటలు పాడేవారని ,అవి తనకు  బాగా ఆకట్టుకున్నాయని పేర్కొన్నారు,  ఆరో తరగతిలోనె పల్లెటూరు గురించి పాట రాసిన ఈయనకు   తరగతి గదిలో ఉన్నవారంతా అప్పట్లో అభినందించారని అన్నారు. అప్పటినుంచి   రాయగలను పాడగలను అనే నమ్మకం ఆత్మవిశ్వాసం పెరిగింది,దీనికి  ప్రేరణ మా అమ్మానాన్నలు ,ప్రకృతి, తన మిత్రురాలు లీష,బంగారు ప్రసాద్ అన్నయ్య,లే అన్నారు. ఇప్పటిదాకా నాలుగు పాటలు స్వయంగా రాసిన రాజు ,ఇంకా కొన్ని పాటలు రిలీజ్ కావడానికి సిద్ధంగా ఉన్నాయన్నారు. పాటలు రాయడం  పాడడం సమాజానికి అవసరమైన సంబంధించిన గ్రీన్ ఇండియా కోసం ప్రేమ ప్రకృతి అనే  పేరుతో షార్ట్ ఫిల్మ్ తీసి ఆ రంగంలో కూడా తన ప్రతిభ కనబరుస్తూ అందరి దృష్టిని ఆకర్షించాడు 

గ్రీన్ ఇండియా పేరుతో మొక్కలు
ప్రేమ ప్రకృతి "అనే సంస్థ "గ్రీన్ ఇండియా "పేరుతో  వివిధ ప్రాంతాల్లో  మొక్కలను నాటడం ప్రారంభిచారు.  ప్రస్తుతం ఇందులో 120 మంది సభ్యులు ఉన్నారు ,ఇఛ్ఛాపురం ,పలాస నియోజకవర్గ పరిధిలోని అనేక మండలాల్లో రహదారులకు ఇరువైపుల వేలాది మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు తోడ్పడుతున్నాడు. చిన్నతనంలో చదువుకున్న  రోజుల్లో తరుచూ చెట్లు ఆవశ్యకత గురించితండ్రి చెప్పేవారని ,  అలాగే  కొర్లాం పాఠశాలలో గురువులు ప్రకృతివలన మనిషికి కలిగే  లాభాలు వివరించారని ,ఆ స్ఫూర్తితో చెట్లు ఎక్కడైనా నరికితే అవి చూస్తూ నిస్సయ స్థితిలో బాధతో అటువైపు చూస్తూ ఉండిపోయేవాడునని , ఇప్పటిదాకా మిత్రులు సహకారంతో సుమారు నాలుగైదు వేల వరకు మొక్కలు నాటికి బంగారు రాజు పలువురికి ఆదర్శంగా నిలిచాడు. బంగారు రాజు మరిన్ని జానపద పాటలుతో  అటు సినీ ,ఇటు టివి రంగాల్లో మంచి పేరు తెచ్చుకోవాలని కొర్లాం గ్రామ సర్పంచ రాంబుడ్డి గణపతి రమణమ్మ ,గ్రామస్తులు ఆకాంక్షించారు

Name*
Email*
Comment*