సోంపేట: ఎక్స్ ప్రెస్ న్యూస్: సెప్టెంబర్ 9:
కొద్ది రోజుల క్రితం హైదరాబాద్ తెలుగు సాహితీవనం సాహితీసంస్థ నిర్వహించిన అంతర్జాల అంతర్జాతీయ కవితల పోటీలో ప్రముఖ కవి చొక్కర తాతారావు రాసిన 'వనదేవత' కవితకు ఉత్తమ కవితా అవార్డుకు ఎంపికైంది. వజ్రపుకొత్తూరు మండలం బైపల్లి గ్రామానికి చెందిన తాతారావు ఇప్పటిదాకా లెక్కకు మించిన కవితలు ,కథలు ,వ్యాసాలు ,రాసి దేశ వ్యాప్తంగా గుర్తింపు పొందారు . ఈ పోటీల్లో 200 పైగా కవితలు వివిధ ప్రాంతాలకు చెందిన కవులు పాల్గొన్నారు. ఇందులో తాతారావు రాసిన 'వనదేవత' కవిత ఉత్తమ కవితగా నిలిచింది. ఇప్పటివరకు తెలుగు అసోషియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా, తెలుగు అసోషియేషన్ ఆఫ్ సౌత్ అమెరికా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణా, ఛత్తీష్ ఘడ్, భిలాయి ,తదితర ప్రాంతాలలో ప్రముఖ సాహిత్యసంస్థల నుండి కవితలకు, కథలకు అనేక నగదు బహుమతి పురస్కారాలు పొందిన తాతారావు కు జనజాగృతి సంస్థ ప్రతినిధి తెప్పల కృష్ణ మూర్తి ,డాక్టర్ కుమార్ నాయక్ ,ప్రముఖ నటుడు ,దర్శకుడు ,రచయిత ఎల్ రుద్రమూర్తి ,అభ్యుదయ ఆంధ్ర ప్రిన్సిపాల్ ,త్రిభాషా జర్నలిస్ట్ మొరుపల్లి బాబూరావు ,సీనియర్ జర్నలిస్ట్ శివజ్యోతి , మడ్డు నాగేశ్వరరావు తదితరులు అభినందించారు.