* జిల్లాలో పూర్తిగా గంజాయి అక్రమ రవాణా అరికడతాం ఎస్పీ
* గంజాయి రహిత జిల్లాగా తీర్చిదిద్దుతా
ఇచ్ఛాపురం, ఎక్స్ ప్రెస్ న్యూస్, సెప్టెంబర్ 9
జిల్లాలో గంజాయి అక్రమ రవాణాను పూర్తిస్థాయిలో అరికట్టి గంజాయి రహిత జిల్లాగా తీర్చి దిద్దుతామని జిల్లా ఎస్పీ జి. మహేశ్వర్ రెడ్డి అన్నారు. సోమవారం సర్కిల్ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఒడిస్సా నుండి పురుషోత్తం చెక్ పోస్ట్ మీదుగా ఆంధ్రాలోకి గంజాయి మూటలను అక్రమంగా తరలించడానికి సిద్ధపడుతున్న అనుమానస్పదంగా కనిపించిన ఆరుగురిని అదుపులోకి తీసుకొని సుమారు రూ. లక్ష విలువగల 25.5 కేజీల గంజాయి మూటలను స్వాధీనం పరుచుకున్నామని తెలిపారు.గంజాయి నిర్మూలనలో భాగంగా సోమవారం పట్టణ పోలీసులు పురుషోత్తపురం చెక్ పోస్ట్ నిగా పెట్టిని తనిఖీలు చేపట్టడం జరిగింది. ఈ నేపథ్యంలో పురుషోత్తం చెక్ పోస్ట్ వద్ద ఒక పాన్ షాప్ వద్ద గంజాయి అమ్మకాలు జరుపుతున్న పురుషోత్తం చిన్న వీధికి చెందిన బుగ్గ చిరంజీవి, తెలుకుల కృష్ణ సాహూ, బుగ్గ సావిత్రితో పాటు గంజాయిని సరఫరా చేస్తున్నారు. ఒడిశా రాష్ట్ర గంజాం జిల్లా తినపోరియా గ్రామానికి చెందిన రవీంద్రసేతి, సింహాచల సేతి మరియు తమిళనాడు తిరునలవెల్లి జిల్లా అలుంగలం తాలూకా నిట్టూరు గ్రామానికి చెందిన ఎం రమేష్ కు అరెస్టు చేసి గంజాయిని స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. వీరి వద్ద నుండి 7 సెల్ ఫోన్లు, ఒక ద్విచక్ర వాహనాన్ని కూడా సీజ్ చేయటం జరిగిందని తెలిపారు. గంజాయి నిర్మూలనలో భాగంగా జిల్లాలో మూడు చోట్ల ఇచ్చాపురం పురుషోత్తపురం చెక్ పోస్ట్, పైడి భీమవరం, పాతపట్నం వద్ద ప్రత్యేక పోస్టులను ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. అంతేకాకుండా గంజాయి అక్రమ రవాణా కాకుండా 24 గంటల పాటు ప్రత్యేక నిఘా పెట్టి ప్రతి వాహనాన్ని తనిఖీలు చేపట్టాలని ఆదేశించడం కూడా జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ పి. శ్రీనివాసరావు, సిఐలు మీసాల చిన్నమనాయుడు, ఇమ్మానుయేల్ రాజు, పట్టణ ఎస్సై చిన్నమనాయుడు పాల్గొన్నారు.