ఇచ్ఛాపురం, ఎక్స్ ప్రెస్ న్యూస్, సెప్టెంబర్ 9
అకాల వర్షాలతో మండలంలో జరిగిన నష్టాలను గుర్తించి అంచనాలు వేసే ప్రతిపాదనను పంపించాలని జిల్లా రెవెన్యూ అధికారి అప్పారావు అధికారులను ఆదేశించారు. సోమవారం తహసిల్దార్ కార్యాలయంలో అన్ని శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కురిసిన భారీ వర్షాలకు ఎంత ఆస్తి నష్టం, పంట నష్టం, ఇల్లు డ్యామేజ్ లు ఎంత మేరకు జరిగిందో క్షేత్రస్థాయిలో పరిశీలించి నివేదికలను అందజేయాలని తెలిపారు. అనంతరం బహుదా నది వరద పరిస్థితి పరిశీలించారు. అలాగే డొంకూరు గ్రామంలో వర్షాలు పరిస్థితి పరిశీలించి, తుఫాన్ షెల్టర్ వద్ద గ్రామస్తులతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో మండల ప్రత్యేక అధికారి శ్రీనివాస్ రెడ్డి, తహసిల్దారు వెంకటరావు, డిఎస్పీ పీ. శ్రీనివాసరావు, సిఐ మీసాల చిన్నమనాయుడు, ఎస్ఐలు చిన్నమనాయుడు, శ్రీనివాసరావు పాల్గొన్నారు.