వర్షానికి రోడ్లు ఛిద్రం

9/9/2024 10:50:13 PM

ఇచ్ఛాపురం, ఎక్స్ ప్రెస్ న్యూస్, సెప్టెంబర్ 9
గడిచిన వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు పలుచోట్ల రోడ్ల దెబ్బతిన్నాయి. వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో వర్షాలు కురుస్తున్నాయి. దీంతో పలుచోట్ల వర్షం నీరు చేరింది. అందులో నుంచి వాహనాలు రాకపోకలు సాగించటంతో ఆ తాకిడికి బాగా నాని ఉన్న రోడ్లపై మొదటి చిన్న గుంతలు ఏర్పడి అవి క్రమంగా పెద్దవయ్యాయి.వాహనదారులు రోడ్లపై ఏర్పడిన గుంతలను గమనించకపోవడంతో ప్రమాదాలు గురవుతున్నారు.బస్టాండ్ జంక్షన్ వద్ద, ఫకీర్ పేట, బహుధా నది వంతెన పై, వికేపేట ఇలా పలుచోట్ల అక్కడక్కడ పెద్ద గుంతలు ఏర్పడ్డాయి. భారీ వర్షాలకు రోడ్లపై నీరు నిల్వ ఉండిపోయింది. ఆర్టీసీ కాంప్లెక్స్ లో నీరు నిల్వ ఉండిపోవడంతో ప్రయాణంలో కాంప్లెక్స్ కు వెళ్లేందుకు ఇబ్బందులు పడ్డారు.

Name*
Email*
Comment*