ఇచ్ఛాపురం, ఎక్స్ ప్రెస్ న్యూస్, సెప్టెంబర్ 9
కురుస్తున్న భారీ వర్షాలకు ఇచ్ఛాపురం మండలం ఈదుపురం గ్రామంలో పారిశుధ్యం అస్తవ్యస్తంగా మారింది. భారీ వర్షాలు కురవడంతో ఈదుపురం బెహరా వీధిలో కాలువల నుండి మురికి నీరు రోడ్లపై పారుతుంది. పట్టణానికి పట్టుకొమ్మలైన పల్లెలు అభివృద్ధికి నోచుకోలేక సమస్యల వలయంలో కొట్టుమిట్టాడుతున్నాయి. కనీస వసతులకు దూరమై నానా అవస్థలు పడుతున్నారు. నిధులు లేవని కారణంతో ప్రజా ప్రతినిధులు, అధికారులు ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారు. బెహరా వీధిలో బురద నీరు తాండవిస్తోంది. ప్రజా ప్రతినిధులుగా ఎన్నికైన ప్రజల కనీస అవసరాలను కూడా తీర్చడం లేదని బహరా వేదిక చెందిన లిట్టు బెహరా వాపోయారు. ఆదివారం కురిసిన భారీ వర్షానికి వరద నీరు పారింది. దీనికి తోడు గత ఐదేళ్ల వైసిపి పాలనలో పంచాయతీ అభివృద్ధి కి వదిలేసింది. వర్షాలు పడ్డాయి అంటే మా పరిస్థితి అధ్వానంగా మారుతుందని అన్నారు. బెహరా వీధిలో రోడ్లు పక్కనే చిరు వ్యాపారులు, వ్యాపారాలను చేసుకుంటున్నామని భారీ వర్షాలకు కాలువలు శుభ్రం చేయకపోవడంతో బురద మురికి నీరు షాపుల వద్దకు చేరుకోవడంతో ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు.