పిచ్చి మొక్కలతో కప్పేసిన సిసి రోడ్
సోంపేట: ఎక్స్ ప్రెస్ న్యూస్: సెప్టెంబర్ 9
సోంపేట మండలం ఎర్రముక్కా మత్స్యకార గ్రామానికి కేవలం 500 మీటర్లు దూరంలో ఉన్న బీచ్ కి వెళ్లే రహదారి పొడవునా రోడ్డు కిరువైపులా పెరిగిన పిచ్చి మొక్కలతో ఈ రహదారి గుండా రాకపోకలు ఇబ్బందిగా మారాయి. ఎర్రముక్కాం బీచ్ గా పేరు న్న దీనికి గత ఏడాది నేతాజీ బీచ్ గా గ్రామానికి చెందిన కొందరు మార్చారు. ఇక్కడ నేతాజీ పేరుతో యువజన సంఘం ఉండటం వల్ల ఈ బీచ్ కు నేతాజీ పేరు పెట్టడం సరే , అయితే దేశ స్వాతంత్ర్యం కోసం తమ ప్రాణాలనే పణంగా పెట్టిన నేతాజీ ఆశయాలు కూడా పాటించాల్సిన బాధ్యత ఆ యూత్ పై ఉంటుంది. ఎవరికంపు వారికి ఇంపు గానే ఉండొచ్చు , ఈ బీచ్ కి కేవలం గ్రామస్తులు మాత్రమే వెళితే అది ఎలా ఉన్న సర్దుకుపోవచ్చు. గణేష్ ఉత్సవాల సందర్భంగా ఈ గ్రామానికి సమీపంలో ఉన్న సుమారు నాలుగు ఐదు గ్రామాలు చెందినవారు గణేష్ విగ్రహాలు నిమజ్జనానికిఈ బీచ్ కు వస్తుంటారు .ఈ సందర్భంగా అయినా జంగిల్ క్లియరెన్స్ పనులు చేపట్టి రాకపోకలకు వీలు కల్పించాలని ఆలోచన ఇక్కడ యువకులకు కలగపోవడం శోచనీయం. ఇటీవల పారిశుధ్యం పేరుతో గ్రామం నలువైపులా రహదారులు శుభ్రం చేశారు. ఇందులో భాగంగా ఈ రహదారిని కూడా క్లియర్ చేసి ఉంటే రాకపోకలకు అనుకూలంగా ఉండేది. స్థానికంగా ఉన్న నేతాజీ యువజన సంఘం సభ్యులు సత్వరమే స్పందించి బీచ్ కి వెళ్లే రహదారి రాకపోకలకు వీలు కల్పించేలా చర్యలు చేపట్టాలని ఎర్రముక్కాం మహిళా సంఘం కోరింది.