- వైస్సార్సీపీ ఎమ్మెల్సి బొత్స
విశాఖపట్నం - ఎక్స్ ప్రెస్ న్యూస్, సెప్టెంబర్, 9
వరదలు వచ్చినప్పుడు ప్రజలను ప్రభుత్వం కాపాడాలి. ప్రభుత్వ నిర్లక్ష్యం వలన విజయవాడ విపత్తు సంభవించింది.చంద్రబాబుకు పబ్లిసిటి మీద ఉన్న శ్రద్ధ ప్రజల ప్రాణాలను రక్షించడం మీద లేదు.బుడమేరు కలువ నుంచి వరద వస్తుందని తెలిసి డీఈ చెప్పిన మాటలు లెక్క చేయలేదు.20 గంటల ముందు వరద వస్తుందని తెలిసి కూడా తాము స్పందించలేదని మరి కొంతమంది అధికారులు చెప్పారు.స్వాతంత్ర్యం వచ్చాక వరదలుపై ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించిన ప్రభుత్వం మరొకటి లేదు.వరదల నిర్లక్ష్యంపై ప్రభుత్వం స్పందించాలి.చంద్రబాబు అమరావతిలో ఉన్నారు కాబట్టి వరదలు రావనుకున్నారా..
గుడివాడ అమర్నాథ్ మాజీ మంత్రి:
మునిగిపోతారని తెల్సి కూడా ప్రజలను వదిలేస్తారా..విజయవాడ వరదలో మరణించిన మరణాలు అన్ని ప్రభుత్వ హత్యలే.అల్లూరి జిల్లాలో గతంలో వర్షాలు వస్తే 250 గ్రామాల ప్రజలను సురక్షతంగా రక్షించాము.దీనికి సీఎం చంద్రబాబు అధికారులు బాధ్యత వహించాలి.పడవలను వైఎస్ఆర్సీపీ నాయకులు వదిలేసారని బురద జల్లుతున్నారు.ప్రభుత్వం మీదే కదా అధికారంలో ఉంది విచారణ చేయండి. ప్రచారం కోసం జెసిబి పై చంద్రబాబు తిరిగారు. అనకాపల్లి జిల్లాలో వర్షాలకు పంటలు మునిగిపోయాయి. ఒక్క అధికారి జిల్లాలో కనిపించలేదు. కొవిడ్ సమయంలో ఐదు కోట్ల మంది ప్రాణాలను వైఎస్ జగన్ కాపాడారు..వైఎస్ జగన్ ప్రవేశ పెట్టిన డోర్ డెలివరీ వాహనాలు సహాయక చర్యల్లో ఉపయోగ పడ్డాయి.వైఎస్ జగన్ రిటైన్ వాల్ నిర్మించకపోతే మరింత ప్రమాదం జరిగి ఉండేది.
45 మంది మరణాలకు చంద్రబాబు బాధ్యత వహించాలి.