ఫిరాయింపుల ఎమ్మెల్యేల‌పై సుప్రీం కీల‌క ఆదేశాలు

9/9/2024 10:57:59 PM


- బీఆర్ఎస్ ఎమ్మెల్యేల అనర్హత పై బాల్ 
  అసెంబ్లీ కార్య‌ద‌ర్శి కోర్టులో 
- అన‌ర్హ‌త పిటీష‌న్లను స్పీక‌ర్ ముందుంచాలి
- నాలుగు వారాలే గ‌డువుచ త‌రువాత కోర్టుకు తెలియ‌జేయాలి

ఎమ్మెల్యేల అనర్హత పైన హైకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి మారిన ఎమ్మెల్యే అంశం పై హైకోర్టు తీర్పు వెలువరించింది. ఇప్పటికే ఈ కేసులో సుదీర్ఘ వాదనలు సాగాయి. పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన ఎమ్మెల్యేలపై స్పీకర్‌ అనర్హత వేటు వేసేలా అసెంబ్లీ కార్యదర్శికి ఉత్తర్వులు జారీ చేయాలని కోరుతూ దాఖలైన పిటీషన్లపై హైకోర్టు తాజా అసెంబ్లీ కార్యదర్శికి ఆదేశాలు ఇచ్చింది. అనర్హత పిటీషన్లను అసెంబ్లీ స్పీకర్ ముందుంచాలని స్పష్టం చేసింది. వివ‌రాలు ఇలా ఉన్నాయి.  బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన వారి పైన అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ హైకోర్టులో పిటీషన్లు దాఖలు చేసింది. దీన్ని విచారించిన హైకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. పార్టీ మారిన ఎమ్మెల్యేల పైన వచ్చిన అనర్హత పిటీషన్లను స్పీకర్ ముందు ఉంచాలని అసెంబ్లీ కార్యదర్శికి హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. విచారణ పైన సమాచారం ఇస్తూ నాలుగు వారాల్లో నిర్ణయం తీసుకోవాలని నిర్దేశించింది. ఫిర్యాదు చేసిన ముగ్గురు ఎమ్మెల్యేలతో పాటుగా పార్టీ మారిన వారి పైన వచ్చిన ఫిర్యాదులకూ ఈ ఆదేశాలు వర్తిస్తాయని చెబుతున్నారు.

లోతుగా విచార‌ణ‌...

బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు గత ఏప్రిల్‌ 24న దాఖలు చేసిన పిటిషన్లపై హైకోర్టు లోతుగా విచారించింది. బీఆర్‌ఎస్‌ తరఫున గెలిచి, కాంగ్రెస్‌ పార్టీలో చేరిన కడియం శ్రీహరి (స్టేషన్‌ఘన్‌పూర్‌), దానం నాగేందర్‌ (ఖైరతాబాద్‌), తెల్లం వెంకట్రావు (భద్రాచలం)పై అనర్హత వేటు వేయాలంటూ బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు పాడి కౌశిక్‌రెడ్డి, కేపీ వివేకానంద పిటిషన దాఖలు చేసారు. అయితే, ఈ ముగ్గురితో పాటుగా పార్టీ మారిన వారి పైన అనర్హత వేటు వేయాలని ఫిర్యాదు చేసారు. దీని పైన విచారించిన హైకోర్టు నాలుగు వారాల్లో స్పీకర్ షెడ్యూల్ ఖరారు చేసి...నిర్ణయం తీసుకోవాలని కోర్టు స్పష్టం చేసింది.

స్పీకర్ నిర్ణయం ఏంటి
హైకోర్టు ఆదేశాల మేరకు ప్రస్తుతం అసెంబ్లీ కార్యదర్శి వద్ద ప్రస్తుతం పెండింగ్ లో ఉన్న అనర్హత పిటీషన్లను స్పీకర్ వద్ద తక్షణం ఉంచాల్సి ఉంటుంది. నాలుగు వారాల్లోగా విచారణకు సంబంధించి షెడ్యూల్ విడుదల చేయాలని..ఆ తేదీలను హైకోర్టుకు సమాచారం ఇవ్వాలని కోర్టు స్పష్టం చేసింది. తమ పిటీషన్ల పైన స్పీకర్ కాలయాపన చేస్తున్నారనేది పిటీషనర్ల ప్రధాన ఫిర్యాదు. ఇక, ఇప్పుడు హైకోర్టు తాజా ఆదేశాల తో అసెంబ్లీ కార్యదర్శి వ్యవహరించాల్సి ఉంటుంది. దీంతో, స్పీకర్ తుది నిర్ణయం కీలకం కానుంది.

తెలంగాణలో ఉప ఎన్నికలు 
తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తి కర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరిన ఎమ్మెల్యేల అనర్హత పై హైకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. నాలుగు వారాల్లోగా చర్యలు తీసుకోవాలని అసెంబ్లీ కార్యదర్శికి సూచించింది. ముగ్గురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేల పై అనర్హత పిటీషన్లు స్పీకర్ వద్ద పెండింగ్ లో ఉన్నాయి. హైకోర్టు తాజా ఆదేశాలతో రాష్ట్రంలో మూడు నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు ఖాయమని బీఆర్ఎస్ నేతలు అంచనా వేస్తున్నారు. నాలుగు వారాల్లో షెడ్యూల్‌ విడుదల చేయకపోతే సుమోటోగా విచారణ జరుపుతామని హైకోర్టు తెలిపడంతో కాంగ్రెస్‌కు హై టెన్ష‌న్ నెల‌కుంది. 

ఎమ్మెల్యేల్లో టెన్షన్ 
కోర్టు తీర్పుతో బీఆర్ఎస్‌లో గెలిచి కాంగ్రెస్‌లోకి వెళ్లిన ఎమ్మెల్యేలలో టెన్షన్ మొదలైంది. హైకోర్టు ఆదేశాల పైన బీఆర్ఎస్ నేతలు స్పందించారు. హైకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగ‌తిస్తున్నామ‌ని మాజీ మంత్రి హ‌రీశ్‌రావు తెలిపారు. ఎమ్మెల్యేల అన‌ర్హ‌త పిటిష‌న్ల‌పై హైకోర్డు ఇచ్చిన తీర్పు కాంగ్రెస్ పార్టీ అప్ర‌జాస్వామిక‌ విధానాల‌కు చెంపపెట్టు అని పేర్కొన్నారు. తెలంగాణ హైకోర్డు తీర్పుతో పార్టీ మారిన ఎమ్మెల్యేలు అన‌ర్హ‌త‌కు గురికావ‌డం త‌థ్యమ‌న్నారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు అన‌ర్హ‌త‌కు గురై ఆయా నియోజ‌క‌వ‌ర్గాల్లో ఉప ఎన్నిక‌లు రావ‌డం ఖాయ‌మ‌న్నారు. ఉప ఎన్నికల అంచనాలు తెలంగాణ హైకోర్టు తీర్పు ప్ర‌జాస్వామ్యాన్ని, రాజ్యాంగ స్ఫూర్తిని నిల‌బెట్టే విధంగా ఉంద‌ని హ‌రీశ్‌రావు పేర్కొన్నారు. అన‌ర్హ‌త కార‌ణంగా ఉప ఎన్నిక‌లు జ‌రిగే నియోజ‌క‌వ‌ర్గాల్లో బీఆర్ఎస్ గెలుపు ఖాయమని చెప్పారు. మూడు స్థానాల్లో మళ్ళీ బై ఎలక్షన్ రావడం ఖాయమని మాజీ మంత్రి ఎర్రబెల్లి వ్యాఖ్యానించారు. నాలుగు వారాలలో చర్యలు తీసుకోకపోతే తామే సుమోటోగా తీసుకుని చర్యలు తీసుకోవాల్సివస్తుందని హై కోర్టుక తెలిపిందన్నారు.

Name*
Email*
Comment*