అంతా అయిపోయాక రంగంలోకి ...

9/9/2024 10:59:32 PM


- తాజాగా  లోకేష్,  ప‌వ‌న్‌లు బోట్ల‌లో 
  ప‌ర్య‌ట‌న‌లు, స‌మీక్ష‌లు 
- అదీ వారం రోజుల త‌రువాత‌
- ప‌డ‌వ‌ల్లో లాహిరి, లాహిరి 
- బాధితులు ఇంకా నీట్లోనేన‌నే సంకేతాలిచ్చారా...?

 విజ‌య‌వాడ‌, ఎక్స్‌ప్రెస్ న్యూస్‌;  
వారం రోజులు దాటిన త‌రువాత తీరిగ్గా మంత్రులు నారా లోకేష్‌, ప‌వ‌న్ క‌ల్యాణ్ లు వేర్వేరుగా బోట్ల‌పై ప‌డ‌వ‌ల‌పై సోమ‌వారం ప‌ర్య‌టించారు. బాధితుల‌కు అసౌక‌ర్యం క‌ల‌గ‌కుండా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఆదేశించ‌డం దొంగ ప‌డ్డ ఆరు నెల‌ల‌కు కుక్క‌లు అరిసిన రీతిలో ఉన్నాయ‌ని కూట‌మి వ‌ర్గంలోనే గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి.

లోకేష్ ఇలా...
బుడమేరు గండ్ల లీకేజ్ విషయంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని మంత్రి నారా లోకేష్ సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. సోమవారం విజయవాడలో సంబంధిత అధికారులు, జనవనరుల శాఖా మంత్రి నిమ్మల రామానాయుడతో సమావేశమైన  లోకేష్ విజయవాడ వరద బాధితులను వీలైనంత త్వరగా ఆదుకోవడానికి ఇంకా మెరుగైన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. బుడమేరు గండ్లు పూడ్చిన చోట ఎత్తు పెంచుతున్న పనులను డ్రోన్ ద్వారా ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్న మంత్రి నారా లోకేష్ ఆ పనులు వెంటనే పూర్తి అయ్యేలా చర్యలు తీసుకుంటున్నారు. ఇదే సమయంలో బుడమేరు గండ్లు పూడ్చిన చోట ఎత్తు పెంచుతున్న వివిద శాఖల అధికారులతో ఎప్పటికప్పుడు చర్చలు జరుపుతున్న మంత్రి నారా లోకేష్ వాటి పనులు వేగవంతం చెయ్యాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

 పవన్ అలా...  

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా సోమ‌వారం కాకినాడ జిల్లాలో పర్యటించారు.  కాకినాడ కలెక్టర్ కార్యాలయంలో వరద పరిస్ధితిపై సమీక్ష నిర్వహించిన పవన్ కల్యాణ్.. ఆ తర్వాత పిఠాపురం వెళ్లారు. కాకినాడ జిల్లాలోని ఏలేరు రిజర్వాయర్ వరద ప్రాంతాల్లో పర్యటించారు. పిఠాపురం నియోజక వర్గం గొల్లప్రోలులోని జగనన్న కాలనీలో కాసేపు బోటులో తిరిగారు. వారి సమస్యల్ని అడిగి తెలుసుకున్నారు. ముంపు సమస్య నుంచి వారిని కాపాడేందుకు శాశ్వత పరిష్కారం చూపిస్తామని బాధితులకు హామీ ఇచ్చారు. ఏలేరు రిజర్వాయర్ ముంపు ప్రాంతాలలో ఉన్నవారిని సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ కు పవన్ సూచించారు. సుద్ధగడ్డ వాగు సమస్యకు ఇక్కడి ఎమ్మెల్యేగా పూర్తి స్థాయి పరిష్కారం చూపుతానని హామీ ఇచ్చారు. గత ప్రభుత్వం జగనన్న కాలనీలు పేరుతో చేసిన తప్పులకు ప్రజలు నష్టపోయారని, ఆ తప్పులను కూటమి ప్రభుత్వంలో సరి చేయాల్సిన అవసరం ఏర్పడిందన్నారు. గొల్లప్రోలులోని జగనన్న కాలనీ స్థలాన్ని లోతట్టు ప్రాంతంలో కొనేశారని, రూ. 30 లక్షల ఎకరా భూమి మార్కెట్ ధరను రూ.60 లక్షలు చెల్లించి కొన్నారని పవన్ ఆరోపించారు.

Name*
Email*
Comment*