శ్రీకాకుళం నగరపాలక సంస్థకు ఎన్నికలు ఎప్పుడో..?

9/9/2024 11:02:33 PM


` రాజకీయ పార్టీలే ప్రధాన కారణమా...?
` ఇరు పార్టీలు కోర్టుకు వెళ్లడమే కారణమా

శీక్రాకుళం, ఎక్స్‌ప్రెస్‌ న్యూస్‌:
శ్రీకాకుళం మున్సిపాల్టీ నుంచి కార్పొరేషన్‌గా ఎదిగినా సుమారు పది సంవత్సరాలుగా ఎన్నికలకు దూరంగానే ఉంది. ఎన్నికలు నిర్వహించకపోవడానికి రాజకీయ పార్టీలే ప్రధాన కారణంగా కనిపిస్తోంది. ఎందుకంటే 2014 తర్వాత అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు (టీడీపీ) అధికారంలో ఉన్నపుడే శ్రీకాకుళంను మున్సిపాలిటీ నుంచి కార్పొరేషన్‌గా అప్‌ గ్రేడ్‌ చేశారు. అప్పుడు కొన్ని సమీప గ్రామాలను కార్పొరేషన్‌లో విలీనం చేస్తూ ఇచ్చిన ఉత్తర్వులను సవాల్‌ చేస్తూ నాడు   వైసీపీ సానుభూతిపరులు కోర్టుకు వెళ్లారు. 2019లో వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నికలు నిర్వహించాలని చూస్తే టీడీపీ సానుభూతిపరులు కోర్టును ఆశ్రయించారు. అలా ఎన్నికలు కాకుండా చేయడంలో ఇరుపార్టీలో తలో చేయి వేశారని చెప్పవచ్చు. 
చంద్రబాబు నాయుడుని కలిసి నప్పుడు కార్పొరేషన్‌ ఎన్నికలు జరిపిద్ధాం...కానీ కోర్టు కేసులు విత్‌ డ్రా కావాలని సమస్యలు లేకుండా చేస్తే ఎన్నిక నిర్వహిద్ధమని చెప్పినట్టు తెలిసింది. అయితే ఇప్పుడు ఇరు పార్టీల పెద్దలు కూర్చొని ఉన్న కేసులు పరిష్కరించే దిశగా సంప్రదింపులు చేయాలి. తద్వారా.. ఎన్నికలు సజావుగా జరిపించే వాతావరణం చూపాలి. ఇది ఒక్క రాజకీయ నాయకుడి వల్ల కాదు ... అందరూ ఒకతాటి మీదకు వచ్చి ప్రజా ప్రయోజనాల దృష్ట్యా ఎన్నికలకు వాతావరణాన్ని సుగమం చేయాలి. తద్వారా ప్రజా పాలనకు ‘శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో అరకురార్పణ చేయాలి. అవసరమైతే కూటమి నాయకులు నాలుగు మెట్లు దిగైనా ఎన్నికల నిర్వహణకు అవసరమైన చర్యలు చేపడతారో లేదో చూడాలి.

Name*
Email*
Comment*