- పార్లమెంట్ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ
న్యూయార్క్;
లోక్ సభ ఎన్నికల ఫలితాలు విడుదలైన అనంతరం ప్రజల్లో బీజేపీపై ఉన్న భయం పోయిందని లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అన్నారు. ఆయన అమెరికా పర్యటనలో భాగంగా డల్లాస్‌లో ప్రసంగించారు. బీజేపీ, ఆర్ఎస్‌ఎస్‌పై విరుచుకుపడ్డారు. భారత దేశం అంటే ఒకే సిద్ధాంతం అనే ఆలోచనతో ఆర్‌ఎస్‌ఎస్ ఉంది. కానీ, భారత్ సిద్ధాంత బహుళత్వంగా కాంగ్రెస్ భావిస్తుందని అన్నారు. దానిపైనే తాము పోరాటం చేస్తున్నామని తెలిపారు. భారతీయ రాజకాల్లో ప్రేమ, గౌరవం తగ్గిపోయాయని అన్నారు.
‘‘లోక్ సభ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ మెజార్టీ స్థానాలు దక్కించుకోలేదు. దీంతో అప్పటి వరకు ప్రజల్లో ఉన్న బీజేపీ, నరేంద్రమోదీపై భయం పోయింది. ఇది రాహుల్ గాంధీ, కాంగ్రెస్ సాధించిన విజయం కాదు. రాజ్యాంగంపై దాడిని అంగీకరించబోమని గ్రహించిన భారత దేశ ప్రజలు విజయం. అదేవిధంగా మహిళల పట్ల వైఖరిపై కూడా బీజేపీ, ప్రతిపక్షాల మధ్య సైద్ధాంతిక తేడాలు ఉన్నాయి. వాటిపై కూడా మేము పోరాటం చేస్తున్నాం. బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్ మహిళలు కొన్ని ప్రత్యేకమైన పనులకు మాత్రమే పరిమితం కావాలని నమ్ముతారు. కానీ మేము అలా కాదు. మహిళలు ఏమి చేయాలని కోరుకున్నా అనుమతించాలని నమ్ముతున్నాం. భారత్ నిరుద్యోగ సమస్యతో ఇబ్బందులు ఎదుర్కొంటోంది. చాలా దేశాల్లో ఈ సమస్య లేదు. పెరుగు దేశం చైనా కూడా నిరుద్యోగ సమస్య లేదు’ అని అన్నారు.
చైనాతో సంబంధాలుతోనే...
అయితే రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై బీజేపీ తీవ్ర విమర్శలు గుప్పిస్తోంది. ‘చైనా కమ్యూనిస్ట్ పార్టీతో తనకున్న ఒప్పందం వల్ల రాహుల్ చైనా కోసం బ్యాటింగ్ చేయడానికి ఉత్సాహంగా ఉన్నారు. విభజించు, పాలించడమే రాహుల్ స్ట్రాటజీ. భారత సిద్ధాంతాలుపై విమర్శలు చేయటం రాహుల్‌కు అలవాటుగా మారింది. ఆయన బెయిల్‌పై ఉన్నందున భారత న్యాయ వ్యవస్థపై దాడి చేస్తాడు’ అని బీజేపీ అధికార ప్రతినిధి ప్రదీప్ భండారీ మండిపడ్డారు.