వినాయకుని నిమజ్జన ప్రదేశాల్లో భద్రత నియమాలు పాటించాలి

9/9/2024 11:05:10 PM


*నీటి ప్రవాహం ఉదృతంగా ఉన్నందున పకడ్బందీగా ఏర్పాట్లు ఉండాలి

* ఎస్పీ కెవి మహేశ్వర రెడ్డి 

శ్రీకాకుళం, ఎక్స్ ప్రెస్ న్యూస్; 
శ్రీకాకుళం పట్టణం కలెక్టర్ ఆఫీస్ రహదారి మార్గంలో ఉన్న పొన్నాడ వంతెన ఇరువైపుల వినాయకుని విగ్రహాలు నిమజ్జనం చేసే ప్రదేశాలను సోమవారం జిల్లా ఎస్పీ  కేవీ మహేశ్వర్ రెడ్డి పోలీసు అధికారులతో సందర్శించి భద్రత పరమైన ఏర్పాట్లపై ఆరా తీశారు. జిల్లాలో గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు కారణంగా నాగావళి నదిలో నీటి ప్రవాహం ఉదృతంగా ఉన్నందున పొన్నాడ వంతెన, ఏడు రోడ్ల - గుజారతిపేట వంతెన, డే అండ్ నైట్ వంతెన ఇరువైపుల నిమజ్జనం చేసే ప్రదేశాలలో తగు జాగ్రత్త చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
ఈ  సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ ఇతర విభాగాల సమన్వయంతో ప్రతి నిమజ్జనం ప్రదేశంలో లైటింగ్ను, క్రేన్ల, ఈతగాళ్లను,లైవ్ బోట్స్, అంబలన్స్, బ్యారికెడిల్, అవసరమగు సిబ్బందిని ముందస్తుగా సిద్ధం చేసుకోవాలని సూచించారు. నిమజ్జనం రోజు ఊరేగింపు జరిగే మార్గంలో విద్యుత్  లైన్లు ఉంటాయని వాటిపట్ల జాగ్రత్త వహించాలని, రహదారి మార్గంలో ట్రాఫిక్ అంతరాయం కలిగించకుండా క్రమ పద్దతిలో ఒకే వైపుగా వినాయక ఊరేగింపు కొనసాగాలన్నారు. ఊరేగింపు సమయంలో డీజే లను పరిమితికి మించిన శబ్దంతో వినియోగించరాదని, వరదల కారణంగా వాగులు, కాలువలు, నదులు ఉధృతంగా ప్రవహిస్తుండడంతో వినాయక నిమజ్జనం జరిగే ప్రదేశంలో భక్తులు ఎవరూ కూడా వినాయక ప్రతిమను స్వతహాగా నిమజ్జనం చేయరాదు అక్కడ ఏర్పాటు చేయబడిన గజ ఈతగాళ్లు, క్రేన్లు సహాయంతో మాత్రమే నిమజ్జనం జరిపించాలి. నిమజ్జన ప్రదేశాల్లోకి చిన్నపిల్లలను ,మద్యం సేవించి ఉన్న వారిని అనుమతించరాదన్నారు. అనుమతులు లేని ప్రదేశంలో ఎవరూ కూడా నిమజ్జనం చేయకూడదు.గణేష్ నిమజ్జనం వివరాలను ముందుగానే సంబంధిత పోలీసు అధికారులకు తెలపాలని పోలీస్ అధికారులు సూచించిన నియమాలు ప్రజలు తూచా తప్పకుండా పాటించి ప్రజా రవాణాకు ఏటువంటి ఆటంకాలు లేకుండా ఒక క్రమ పద్ధతిలో నిమజ్జన ప్రదేశంలో వినాయక ప్రతిమలను నిమజ్జనానికి ప్రశాంతంగా తీసుకుని వెళ్లాలని ఎస్పీ కోరారు.
జిల్లా ఎస్పీ వెంట టౌన్ డిఎస్పీ సిహెచ్ వివేకానంద్, టౌన్ సిఐలు పైడిపు నాయుడు, ఎస్బి ఇమైనల్ రాజు ఉన్నారు.

Name*
Email*
Comment*