గిరిశిఖర గ్రామాల ప్రజలను అప్రమత్తం చేయండి జిల్లా కలెక్టర్ ఎ. ఎస్. దినేష్ కుమార్

9/9/2024 11:06:30 PM


పాడేరు - ఎక్స్ ప్రెస్ న్యూస్,సెప్టెంబరు, 9            
గిరి శిఖర గ్రామాలు, కొండవాలు ప్రాంతాలలో నివాసం ఉండే ప్రజలను అప్రమత్తం చేయాలని జిల్లా కలెక్టర్ ఎ. ఎస్. దినేష్ కుమార్ అధికారులను ఆదేశించారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావం జిల్లాపై ఎక్కవగా ఉందన్నారు. ఎడతెరిపిలేకుండా వర్షాలు కురుస్తున్నాయని స్పష్టం చేసారు. సోమ వారం ఉదయం కలెక్టరేట్ నుండి అధికారులతో టెలీ కాన్ఫెరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రహదారులు, వంతెనలు ఎక్కడ తెగిపోయాయో వెంటనే సమాచారం అందించాలని స్పష్టం చేసారు. ప్రజలు కాలి నడకన, వాహనాలపైన వాగులు గెడ్డలు దాటకుండా చైతన్యవంతం చేయాలని సూచించారు. తెగిపోయిన గెడ్డలు, వాగుల వద్ద పోలీసు, రెవెన్యూ సిబ్బందిని నియమించాలని అన్నారు. క్షేత్ర స్థాయి అధికారులు, సిబ్బంది నిరంతరం కాజ్ వేలు, కల్వర్టుల పరిస్థితులను పరిశీలించి నివేధించాలని చెప్పారు. మండలాల్లో వర్షపాతం నమోదు సక్రమంగా చేయాలని పేర్కొన్నారు. పాడేరు డివిజన్లో తొమ్మిది చోట్ల, రంపచోడవరం డివిజన్లో ఏడు చోట్ల రకాపోకలకు అంతరాయం ఏర్పడిందన్నారు. ప్రమాదాలు తాగునీటి సమస్యలను అడిగి తెలుసు కున్నారు. వ్యవసాయ, ఉద్యానవన అధికారులు పంటనష్టాలను నమోదు చేయాలన్నారు.

జిల్లాలో ఉన్న ఐదు ఘాట్ రోడ్లలో వాహనాల రవాణాను నిషేదం పొడిగించాలని అన్నారు. నిత్యావసర సరుకులు, అత్యవసర సేవల వహనాలను అనుమతించాలని అధికారులను ఆదేశించారు. రహదారులు పునరుద్ధరణ పనులను యుద్ద ప్రాతి పదికన చేపట్టాలని రాహదారులు భవనాలు, పంచాయితీ రాజ్, గిరిజన సంక్షేమ శాఖ ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. రానున్న 24 గంటల్లో పునరుద్ధరణ పనులు పూర్తి చేసి రవాణా సదుపాయాలు మొరుగు పరచాలన్నారు. జోలా పుట్టు డ్యాం ఏడు గేట్లు ఎత్తి దిగువకు నీరు విడుదల చేస్తున్నారని లోతట్టు గ్రామాల ప్రజలకు అప్రమత్తంగా ఉండాలన్నారు. చింతూరు డివిజన్ శబరి సదికి 38 అడుగుల నీటి మట్టం పెరిగినందున ప్రభావిత గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించి పునరావాసం కల్పించాలన్నారు. రంపచోడవరం డివిజన్ లో అన్ని మండలాలలో నీటి ప్రవాహాలు అధికంగా ఉందని చెట్లు నేలకొరిగే అవకాశం ఉందని అవసరమైన చోట పునరావాసం కల్పించాలని పేర్కొన్నారు. పాడేరు డివిజన్ పాడు పడి భవనాలు, మట్టి నిర్మాణాలు, కల్వర్టులు పరిశీలించి ఎటువంటి ప్రమాదాలు జరగకుండా తగిన చర్యలు చేపట్టాలన్నారు.మృతుని కుటుంబానికి రూ.5 లక్షలు పరిహారం జి.కె. వీధి మండలం గాలికొండ పంచాయతీ చట్రాపల్లి గ్రామంలో ఆదివారం అర్ధరాత్రి కొండ చరియలు విరిగి పడి మృతి చెందిన కొర్రా 8(20) కుటుంబ సభ్యులకు జాతీయ, రాష్ట్ర విపత్తుల సంస్థ నిబంధనల మేరకు రూ.5 లక్షల ఎక్స్రేషియాను జిల్లా కలెక్టర్ ప్రకటించారు. మరో ముగ్గురు వ్యక్తులు కొర్రా పండన్న (60), కొర్రా సుమిత్ర (18) కొర్రా సుబ్బారావు (25) గాయ పడ్డారని వారిని సప్పర్ల ప్రాధమిక ఆరోగ్య కేంద్రంలే చేర్పించి చికిత్స అందిస్తున్నారని, వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని కలెక్టర్ తెలిపారు.

ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ డా. ఎం.జె. అభిషేక్ గౌడ్, డి. ఆర్. ఓ, బి. పద్మావతి, సిపి ఓ ఎస్. ఎస్. ఆర్.కె. పట్నాయక్, వివిద ప్రాంతాల నుండి ఎస్సీ సుమీత్ బర్దార్, ఐటిడి ఏ పివోలు, కట్టా సింహాచలం, అపూర్వ భరత్, సబ్ కలెక్టర్లు కల్పశ్రీ, సౌర్యమన్ పటేల్, తాహశీల్దారులు, ఎంపిడి ఓలు తదితరులు పాల్గొన్నారు.

Name*
Email*
Comment*