మృతులకు పరిహారం ఇవ్వాలి.. గల్లంతైన వారిని వెలికితీయాలి

9/9/2024 11:11:47 PM

   - సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు కె.లోకనాధం.

 విశాఖపట్నం - ఎక్స్ ప్రెస్ న్యూస్, సెప్టెంబర్, 9
అల్లూరి సీతారామరాజు పాడేరు జిల్లా జి.కె.వీధి మండలం గాలికొండ పంచాయితీ చట్రాపల్లిలో అర్ధరాత్రి కొండచరియాలు విరిగి పడడంతో కొర్రా కుమారి (20) మృతిచెందగా మరో ముగ్గురు గల్లంతైన ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి మృని కుటుంబానికి రూ.25లక్షల పరిహారం ఇవ్వాలని, గల్లంతైన వారిని వెంటనే వెలికి తీయాలని సిపిఎం విజ్ఞప్తి చేస్తుంది.
 ఉత్తరాంధ్రలో గత మూడు రోజులుగా ఎడతెరిపిలేకుండా భారీ వర్షాలు పడుతున్నాయి. వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ఈ పరిస్థితుల కారణంగానే జి.కె.వీధి చట్రాపలిల్లో నిన్న అర్ధరాత్రి సమయంలో కొండచరియాలు విరిగిపడి ఒక మృతి చెందగా మరో ముగ్గురు గల్లంతయ్యారు. ఆ గ్రామస్తుల ఇళ్లులు ధ్వసంమైయ్యాయి. ఆ ప్రాంతంలో సిగ్నల్స్‌ లేకపోవడంతో పూర్తి సమాచారం బాహ్యప్రపంచానికి తెలియడంలేదు. అరకు ` విశాఖపట్నం వచ్చే ఘాట్‌ రోడ్డుల్లో కూడా కొండచరియలు విరిగిపడి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం, జిల్లా అధికార యంత్రాంగం వెంటనే స్పందించి ఎన్‌డిఆర్‌ఎఫ్‌ బృందాలను పంపించి సహాయక కార్యక్రమాల చేపట్టి కొండచరియాలను తొలగించాలని సిపిఎం కోరుతుంది.చట్రాపల్లిలో సర్వంకోల్పోయిన వారిని ఆదుకోవాలని, వారిని సురక్షిత ప్రాంతానికి తరలించి పక్కా గృహాలు నిర్మించి ఇవ్వాలని సిపిఎం డిమాండ్‌ చేస్తోంది.

Name*
Email*
Comment*