చీపురుపల్లి - ఎక్స్ ప్రెస్ న్యూస్, సెప్టెంబర్, 9,
స్థానిక జడ్పీటీసీ ఆఫీస్ లో జడ్పీటీసీ వలిరెడ్డి శిరీష, జిల్లా వైస్సార్ పార్టీ కార్యదర్శి వలిరెడ్డి శ్రీనివాసనాయుడు మాట్లాడుతూ చీపురుపల్లి మండలంలో రెండురోజులనుంచి పడుతున్న వర్షాలకు అధికారులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జడ్పీటీసీ వలిరెడ్డి శిరీష, జిల్లా వైస్సార్ పార్టీ కార్యదర్శి వలిరెడ్డి శ్రీనివాసనాయుడు ప్రజలకు అధికారులను కోరారు, ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు గణేష్ మండపాల నిర్వాహకులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. ఎక్కువగా వర్షాలు పడడం వలన విద్యుత్ ప్రమాదాలు సంభవిస్తాయని(కరెంటు షాక్)పిల్లలని వీటికి దూరంగా ఉంచాలని కోరారు. అధికారులు ప్రభుత్వస్కూల్స్ కానీ ప్రభుత్వ ఆఫీస్ లు కానీ రేపటి నుంచి స్కూల్ తెరుస్తారు. కావున ప్రభుత్వస్కూల్స్ కానీ పాతవి ఉంటే వాటి గోడలు నాని పోయి పడిపోయే ప్రమాదం వుంది అటువంటి వాటిని గుర్తించి తగు జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు, ప్రజలని కూడా అప్రమత్తం చెయ్యాలని పాత ఇళ్ళు కానీ పాడుయినగోడలు కానీ వర్షాలకు నానీ పోయి పడిపోయే ప్రమాదం వుంది కనుక అటువంటి వారు తగు జాగ్రత్త లు తీసుకోవాలని కోరారు. డాక్టర్స్, మెడికల్ సిబ్బంది ఈ వర్షాకాలంలో వస్తున్న జ్వరాలకు, జలుబు, దగ్గు వంటి వాటికి మందులు అందుబాటులో ఉంచి ప్రజలకు తగిన అవగాహన కల్పించాలని తెలియజేసారు. ఎవరికి అయినా మెడికల్ ఎమరజెన్సీ కానీ ఇంకా ఎటువంటి సహాయాసహకారాలు కావలిసిన మా వైస్సార్ పార్టీ నాయకులు అందరం అందుబాటులో ఉంటామని ప్రజలు అందరూ ఈవర్షాలకి జాగ్రత్త గా ఉండాలని కోరారు. ఈ కార్యక్రమం లో జడ్పీటీసీ వలిరెడ్డి శిరీష, జిల్లా కార్యదర్శి వలిరెడ్డి శ్రీనివాసనాయుడు పాల్గొన్నారు.