ప్లాంట్ ను రక్షించుకోడమే సీతారాం ఏచూరి కు నిజమైన నివాళి

9/13/2024 8:57:09 PM

స్టీల్ ప్లాంట్ - ఎక్స్ ప్రెస్ న్యూస్: సెప్టెంబర్ 13:
విశాఖ స్టీల్ ప్లాంట్ ను రక్షించుకోవడమే సీతారాం ఏచూరి కి నిజమైన నివాళి అని స్టీల్ అఖిలపక్ష కార్మిక సంఘాల ప్రతినిధులు అన్నారు. స్టీల్ సిఐటియు ఆధ్వర్యంలో శుక్రవారం ప్లాంట్ స్టోర్ జంక్షన్ వద్ద నిన్న అకాల మరణం చెందిన సిపిఎం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ సీతారాం ఏచూరి సంతాప సభను నిర్వహించారు. ఈ సభకు స్టీల్ సిఐటియు అధ్యక్షులు వై టి దాస్ అధ్యక్షులు గా వ్యవహరించారు. ముందుగా ఆయనకు నివాళులర్పించారు. ఈ సభలో స్టీల్ సిఐటియు అధ్యక్షులు జె. అయోధ్యరామ్, స్టీల్ సిఐటియు ప్రధాన కార్యదర్శి యు. రామస్వామి, స్టీల్ ఐఎన్టియుసి ప్రధాన కార్యదర్శి మంత్రి రాజశేఖర్, స్టీల్ ఏఐటీయూసీ అధ్యక్షులు కె ఎస్ ఎన్ రావు మాట్లాడుతూ ప్రభుత్వ రంగ పరిశ్రమలపై అవగాహనతో కూడిన ప్రసంగాలను ప్రతి ఒక్కరికి అర్థమయ్యే విధంగా ప్రసంగించడం ఆయన ప్రత్యేకతని వారు అన్నారు. బి హెచ్ పి వి, ని బిహెచ్ఇఎల్ లో విలీనం చేయడం, షిప్ యార్డ్ ను డిఫెన్స్ లో విలీనం చేయడం వంటి కమిటీలకు చైర్మన్ గా వ్యవహరించారని వాటిని విలీనం చేయడంలో ఆయన ప్రధాన భూమిక పోషించారని వారు వివరించారు. సీతారాం ఏచూరి బహుముఖ ప్రజ్ఞాశాలి అని భారత రాష్ట్రపతి, ప్రధాన మంత్రి తో సైతం నేడు కొనియాడుతున్నారని వారు అన్నారు. ఆయన విలువలతో కూడిన రాజకీయాన్ని ప్రతి ఒక్కరూ ప్రశంసించారు. ఆయన మృతి తీరని లోటని ప్రతి ఒక్కరూ ఆయన ఆశయాల కోసం కృషి చేయాలని వారు విజ్ఞప్తి చేశారు. స్టీల్ ప్లాంట్ ఉద్యమంలో ఆయన ప్రత్యక్షంగా పాల్గొన్నారని, దీనిని రక్షించుకోవడమే ఆయనకు నిజమైన నివ్వాలని వారు అన్నారు.  ఈ కార్యక్రమంలో స్టీల్ అఖిలపక్ష కార్మిక సంఘాల ప్రతినిధులు పి శ్రీనివాసరాజు, నీరుకొండ రామచంద్రరావు, జె. రామకృష్ణ, స్టీల్ అధికార సంఘం ప్రధాన కార్యదర్శి కె వి డి ప్రసాద్, ఎస్సీ ఎస్టీ అసోసియేషన్ అధ్యక్షులు భయ్యా మల్లయ్య, ఓబీసీ అధ్యక్షులు బి. అప్పారావు, అట్టా అప్పారావు, కాంట్రాక్ట్ లేబర్ యూనియన్ అధ్యక్షులు జి. శ్రీనివాస్ తదితరులతో పాటు స్టీల్ సిఐటియు వివిధ విభాగాల అధ్యక్ష కార్యదర్శులు, అధిక సంఖ్యలో కార్మికులు పాల్గొన్నారు.

Name*
Email*
Comment*