సర్వసభ్య సమావేశంలో పాల్గొన్న జిల్లా పరిషత్ చైర్ పర్సన్ మజ్జి శ్రీనివాసరావు

9/13/2024 9:00:48 PM

తెర్లాం: ఎక్స్ ప్రెస్ న్యూస్: సెప్టెంబర్ 13:- 
తెర్లాం మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ ఎన్. ఉమా లక్ష్మి  అధ్యక్షతన సర్వ సభ్య సమావేశం శనివారం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలో గల వ్యవసాయ, రైతులకు న్యాయమైన ఎరువులు విత్తనాలు చేరుకునేందుకు తగు జాగ్రత్తలు చేపట్టాలని, ప్రతి ఊరిలో గోడౌన్స్ ఏర్పాటు చేసిన ప్రయత్నం చేయాలని వ్యవసాయ అధికారులకు సూచించారు. వర్షాల కారణంగా పంట పొలాలకు, పాడి పశువులకు, గ్రామాల్లో తాగునీరు సాగునీరు వంటి వాటిపై ప్రత్యక్ష ప్రత్యేక దృష్టి పెట్టి తగు చర్యలు తీసుకోవాలని ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అధికారులకు తెలిపారు. మండలంలో గల కొన్ని గ్రామాలకు కరెంట్ స్తంభాలు కావాలని ఐరన్ స్తంభాలు మార్చి సిమెంట్ స్తంభాలు పట్టాలని, పంట పొలాల్లో ఉన్న లూస్ ప్యానెల్స్ పై ప్రత్యేక దృష్టి పెట్టాలని వర్షాకాలంలో మరింత అప్రమత్తంగా ఉండాలి, ఎవరికి ఎటువంటి హాని జరగకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని విద్యుత్  అధికారులకు తగు సూచనలు జారీ చేశారు. అంతేకాకుండా జిల్లా పరిషత్ నిధుల నుండి 10 లక్షల రూపాయలు కేటాయిస్తామని ఆయన తెలియజేశారు. సీజనల్ వ్యాధుల నివారణ కొరకు టైఫయిడ్, మలేరియా, డేగ్యూ, విష జ్వరాలు వంటి వ్యాధుల తగ్గుదల కోసం తగిన చర్యలు చేపట్టాలని రాజ్య సిబ్బందికి సూచించారు. ప్రజలకి కావలిసిన అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉంచాలి అలాగే ప్రజలు ఆరోగ్యం పట్లలా అప్రమత్తంగా ఉండాల అన్నారు. మండలంలో ఎవరికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా అధికారులందరూ పనిచేయాలని, మరి ముఖ్యంగా గ్రామాలలో ఎటువంటి ఇబ్బంది జరగకుండా చూడాలని వారికి ప్రజాప్రతినిధుల మద్దతు ఎప్పుడు ఉంటుందని తెలియజేశారు. ఈ కార్యక్రమం లో ఎంపీపీ ఉమా లక్ష్మి, జెడ్పీటీసీ లుర్ధు ,ఎంపీడీవో రామకృష్ణ, మండల అధికారులు, ఎంపీటీసీలు, సర్పంచులు, పాల్గొన్నారు.

Name*
Email*
Comment*