నా కుమారుని చూపించండి ఎస్పీ సారూ ...

9/13/2024 9:53:51 PM

 మాజీ మావోయిస్టు నేత 
దున్నకేశవ అలియాస్ ఆజాద్.తల్లి  వినతి

సహకరించిన ఎమ్మెల్యే శిరీషా

తన కుమారినికి న్యాయం చేయండి..

సోంపేట: ఎక్స్ ప్రెస్ న్యూస్: సెప్టెంబర్ 13
హింస తప్పు , ప్రతిహింస తప్పు కాదు ,అని అన్నది మావో కాదు ,మనోడు మహాత్మా గాంధీ అన్న సిధ్ధాంతాన్ని నమ్మి  దగా పడ్డ  పీడిత ప్రజలకు న్యాయం చేయడానికి మావోయిస్ట్  పార్టీ లో చేరి ఉద్దానం ప్రాంత దళ డిప్యూటీ కమాండర్ స్థాయి కిచేరిన  మందస మండలం నల్ల బొడ్లూరు గ్రామానికి చెందిన దున్న కేశవరావు అలియాస్ ఆజాద్.ను 2011లో  అప్పటి ఒడిశా ప్రభుత్వం  పీపుల్స్ వార్ పార్టీలో అజ్ఞాతంలో ఉన్న వారంతా   జన జీవన స్రవంతిలోకి రావాలన్న పిలుపు  దివంగత పలాస  ఎమ్మెల్యే  జుత్తు జగన్నాయుకులు సహకారంతో  అజాద్ పోలీసులకు లొంగిపోయాడు. జనజీవన స్రవంతిలో కలిసిన ఆయన్ని  ఒడిశా పోలీసులు ఆ రాష్ట్రంలో కేసులు ఉన్నాయని  తిరిగి అరెస్టు చేసారు.   భువనేశ్వర్ సెంటర్ జైల్లో కేశవరావు  13 ఏళ్లుగా జైల్లోనే ఉన్నాడని తల్లి దున్నకాములమ్మ శుక్రవారం పలాసలో జరిగిన గ్రీవెన్స్ లో జిల్లా ఎస్పీ కెవి ,మహేశ్వర రెడ్డిని కలిసి తన బిడ్డను చూపించాలని వేడుకుంది .దీనికి పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష సహకారాన్ని ఆమె తీసుకుంది. ఓ తల్లి బిడ్డ కోసం పడుతున్న వేదనకు మరో అమ్మ మనసు తోడయ్యింది. ఆ వ్యక్తి ఆచూకీ కోసం బాసటగా నిలిచారు  ఎమ్మెల్యే శిరీషా  కాశీబుగ్గ పోలీస్ స్టేషన్ లో శుక్రవారం స్పందన నిర్వహించగా, ఆ సమస్యను పలాస ఎమ్మెల్యే ఎస్పీ దృష్టికి తీసుకువెళ్లి. మందస మండలం నల్లబొడ్లూరు గ్రామానికి చెందిన దున్న కేశవరావు అలియాస్ ఆజాద్ తల్లికి న్యాయం చేయాలని కోరారు. మావోయిస్టుగా పలు దళాల్లో పనిచేసారు. అయితే 2011 లో  అప్పటి ఆంద్ర ప్రభుత్వ పిలుపు మేరకు స్వచ్చందంగా లొంగిపోయారు. అయితే ఆయన లొంగుబాటు అనంతరం ఒడిశా పోలీసులు విచారణకు తీసుకెళ్తున్నామని చెప్పి, నేటివరకు తిరిగి పంపించలేదని ఆయన తల్లి దున్న కాములమ్మ పలాస ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా, ఆమెతో కలసి ఎస్పీని ఎమ్మెల్యే కలిశారు. గతంలో ఎమ్మెల్యేగా పనిచేసిన తన తండ్రి  గౌతు శ్యామసుందరం శివాజీ ఈ విషయమై ఉన్నతాధికారులను కలిసినట్లు వెల్లడించారు. అప్పట్లో ఇంటర్ స్టేట్ అధికారుల సమావేశాలు జరిగినట్లు తెలిపారు.  మాజీ మావోయిస్టుని ఒడిశా పోలీసులు అదుపులోకి తీసుకుని 13 ఏళ్ళు కావస్తోందని, ఆ బిడ్డను ఆ తల్లి చెంతకు చేర్చాలని విజ్ఞప్తి చేసారు. ఈ విషయమై ఎస్పీ మహేశ్వర రెడ్డి స్పందిస్తూ ఉన్నత అధికారుల దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు.

Name*
Email*
Comment*