ఇళ్ల బిల్లులు పై ఎంపిడిఓ ఇంటింటి సర్వే...

9/13/2024 9:56:26 PM

సోంపేట: ఎక్స్ ప్రెస్ న్యూస్: సెప్టెంబర్ 13,
వజ్రపుకొత్తూరు మండలంలో 2014-2019 సంవత్సరం లోఎన్టీఆర్ గృహ నిర్మాణం పథకం కింద మంజూరైన ఇళ్లుకు సంబంధించిన ఇల్లు నిర్మాణం జరిగి  బిల్లులు రాని ‌లబ్దిదారులకు బిల్లులు మంజూరు చేయించి న్యాయం చేస్తామని వజ్రపుకొత్తూరు ఎంపీడీవో ఈశ్వరమ్మ అన్నారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు శుక్రవారం కొత్తపేట ,కొమర ల్తాడ గ్రామాల్లో లబ్ధిదారులు  వద్దకు వెళ్లి ఇంటింటి సర్వే చేశారు. ఈ సందర్భంగా ఎంపీడీవో మాట్లాడుతూ తీర ప్రాంత గ్రామాల్లో ఇల్లు నిర్మాణాలు జరిగి  బిల్లులు రాని వారు ఎక్కువుగా ఉన్నారని, ఈ సర్వే వేగవంతంగా పూర్తి చేసి ప్రతి ఒక్క లబ్దిదారుడికి వారి అకౌంట్లో జమ  చేస్తామని పేర్కొన్నారు . మండలంలో  26 పంచాయతీల్లో బిల్లులు  రాని లబ్ధిదారులు ఉన్నారని, మండలంలో ఈ సర్వేకోసం నాలుగు బృందాలుగా ఏర్పాటు చేయడం జరిగిందని, త్వరగతిన సర్వే పూర్తి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్లు అంబటి శ్రీను, చింత రాజు, టిడిపి పార్టీ నాయకులు గోవింద్ పాపారావు , మత్స్య శాఖ ఫీల్డ్ ఆఫీసర్ కొండ నాగరాజు, ఏ ఎఫ్ ఎఫ్ రంగారావు, సాగర్ మిత్ర సునీత, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

Name*
Email*
Comment*