గ్రామాల్లో దండోరా వేయించిన అధికారులు

9/13/2024 10:03:19 PM


కంచిలి: ఎక్స్ ప్రెస్ న్యూస్: సెప్టెంబర్ 13: 
మండలంలో బొగబని పంచాయతీ మహాల్పడా రెవిన్యూ గ్రామ పరిధిలో ఏర్పాటుచేసిన ఎం సి డెవలపర్స్ ఏర్పాటుచేసిన అక్రమ లేఅవుట్లను ఎవరూ కొనుగోలు చేయవద్దని మండలంలో గల 31 పంచాయతీ ప్రజలకు పంచాయతీ తలయారుల ద్వారా దండోర వేయిస్తూ టామ్ టామ్ చేయించడం జరిగింది. మహల్పడ రెవెన్యూ గ్రామంలో ఎన్సీ డెవలపర్స్ ఏర్పాటు చేసిన లేఅవుట్కు ఎటువంటి అనుమతులు లేవని అందులో ప్రభుత్వ భూములు గ్రామకంఠం డీ పట్ట భూములు కలవు .ఆ భూముల్లో  వేసిన లేఔట్లకు అమ్మకాలు కొనుగోలు జరిపిన యెడల వారే బాధ్యత వహించాలని అధికారులు తెలిపినప్పటికీ ఎన్సీ కంపెనీ ప్రవేశపెట్టిన అనేక ఉచిత బహుమతులకు ఆశపడి మోసపోవద్దని తెలిపారు. ఆర్డీవో ఆదేశాల మేరకు టామ్  టామ్ వేయించే కార్యక్రమాన్ని తహసిల్దార్ జయలక్ష్మి పర్యవేక్షణలో జరిగింది. అనంతరం ఎన్సి డెవలపర్స్ చదును చేపించిన ప్రభుత్వ భూములు సరిహద్దులను పోల్చి కంచి వేయించే కార్యక్రమం చేపడతామని తెలిపారు. లే అవుట్లను రిజిస్టర్ ను చేసే సబ్ రిిస్ట్రార్ ఆఫీస్ లో కూడా అనుమతులు లేని కారణంగా ఆయ సర్వే నంబర్లలో  రిజిస్ట్రేషన్ నిలుపుదల చేయాలని సోంపేట రిజస్టర్ కార్యాలయంకు నోటీసులు పంపించారు.

Name*
Email*
Comment*