ధ్రువపత్రాలు మంజూరులో ఇబ్బందులు తొలగించాలి

9/13/2024 10:09:24 PM


 సీఎం, డిప్యూటీ సీఎంలకు జాగృతి సంస్థ ప్రతినిధి వినతి

సోంపేట: ఎక్స్ ప్రెస్ న్యూస్: సెప్టెంబర్ 13
రాష్ట్రంలో వివిధ పోటీ పరీక్షలకు దరఖాస్తులు చేసుకునేందుకు విద్యార్థులకు సర్టిఫికెట్లు గ్రామ సచివాలయాలనుంచి జారీ చేస్తున్న సందర్భాల్లో అనేక రకాల ఇబ్బందులు ఎదురవుతున్నాయని, సర్టిఫికెట్లు అందించడంలో జరిగే జాప్యం వల్ల విద్యార్థులు ఉద్యోగాలు కోల్పోవాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయని వీటిపై ప్రత్యేక దృష్టి సారించి నిబంధనలు సడలించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కొర్లాం జాగృతి స్వచ్ఛంద సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు, ప్రముఖ మనోవికాస నిపుణులు రాంబుడ్డి గణపతి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ లకు వేరువేర్వుగా ఆన్లైన్లో పంపిన లేఖల్లో కోరారు. విద్యా సంవత్సరం ప్రారంభమైన నేపథ్యంలో విద్యార్థులకు పలు రకాల ధ్రుపత్రాలు పొందే క్రమంలో ఎదురౌతున్న ఇబ్బందులు లేఖలో వివరించారు.  కుల ఆదాయ, నివాస  ,జాతి జనణ తదితర సర్టిఫికెట్లు పొందేందుకు విద్యార్థులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని, పేర్కొన్నారు. అలాగే రైతులకు భూమికి సంబంధించిన స్థల ధ్రువీకరణ పొజిషన్ సర్టిఫికెట్ అడంగల్, ఫ్యామిలీ సర్టిఫికెట్లు రెవెన్యూ శాఖ నుంచి పొందే సమయం లో అనేక ఇబ్బందులు తలెత్తుతున్నాయని, గ్రామ వార్డు సచివాలయం తహశీల్దార్ కార్యాలయంలో కాలయాపన వల్ల రైతులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని వివరించారు. గడువులోగా సర్టిఫికెట్లు జారీ చేసేలా ప్రభుత్వం నిబంధనలో సడలించి విద్యార్థులకు రైతులకు విభిన్న వర్గాల వారికి న్యాయం చేయాలని ఆయన కోరారు.

Name*
Email*
Comment*