ఆయన మరణం తీరనిలోటు

9/13/2024 10:12:07 PM

- ఏచూరి సంతాప సభలో వక్తలు

సోంపేట: ఎక్స్ ప్రెస్ న్యూస్: సెప్టెంబర్13
భారత  కమ్యూనిస్టు ఉద్యమ  నిర్మాత కామ్రేడ్ సీతారాం ఏచూరి మృతి కమ్యూనిస్టు, ప్రజాతంత్ర లౌకిక ఉద్యమాలకు తీరనిలోటని సిపిఎం పార్టీ సోంపేట మండల కార్యదర్శి సంగారు. లక్ష్మీ నారాయణ అన్నారు. స్థానిక చౌడేశ్వరి కళ్యాణ మండపంలో సిపిఎం పార్టీ జాతీయ కార్యదర్శి కామ్రేడ్ సీతారాం ఏచూరి సంతాప సభ జరిగింది. చిత్రపటానికి పూలమాలేసి  నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మార్క్సిజాన్ని భారతీయ పరిస్థితులకు వర్తింపచేసి విప్లవ శక్తులను కొత్త పుంతలు తొక్కించడానికి విరామ మెరుగక కృషిచేసిన వ్యక్తి కామ్రేడ్ ఏచూరి గారని వారన్నారు. సామ్రాజ్యవాదం, మతోన్మాదంపై రాజీలేని యుద్ధం చేసిన యోధుడు కామ్రేడ్ ఏచూరి అని వారు కొనియాడారు. కార్మిక కర్షక పోరాటాల మార్గదర్శి  వామపక్ష లౌకిక ప్రజాతంత్ర శక్తుల సమన్వయం రథసారథి మృతి తీరని లోటుని వారన్నారు. ఐదు దశాబ్దాలుగా ఎన్నో పోరాటాలకు ఊపిరి పోసిన వ్యక్తి ఒక శక్తి కామ్రేడ్ సీతారాం ఏచూరి అని వారు అన్నారు . 12 ఏళ్లు రాజ్యసభ సభ్యునిగా విశేష కృషి చేసిన ఆయనను ఉత్తమ పార్లమెంటేరియన్  అవార్డు వరించిందని  అన్నారు. రాజ్యసభ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్రపతి ప్రసంగానికి సవరణలకు పట్టుబట్టి సాధించడంలో ఆయన నిబద్ధతకు, కార్యదక్షతకు నిదర్శనమని వారన్నారు. పార్లమెంట్లో ప్రజావాణి వినిపించారని అన్నారు. యునైటెడ్ ఫ్రంట్ నుండి ఇటీవల ఇండియా వేదిక వరకు వాటిని సమన్వయం చేయడంలో ఏచూరి కృషి ఆధునిక భారతదేశ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందని వారన్నారు. ప్రజాస్వామ్యం, సెక్యులరిజం పరిరక్షణకు జరిగిన పోరాట ఉద్యమాల్లో ఏచూరి పాత్ర అద్భుతమైనదని వారు కొనియాడారు. ఈ సంతాప సభలో పార్టీ సీనియర్ నాయకులు దుంపల కృష్ణారావు కే గోపీనాథ్ పొందర చిరంజీవి నెయ్యల విజయకుమార్ ఎన్ హైమావతి దానేశ్వరి సరోజినీ కే. రాజు  తదితరులు పాల్గొన్నారు.

Name*
Email*
Comment*