ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో జిల్లేడు ద్రావణం తయారీ విధానం

9/13/2024 10:16:05 PM


ఎల్ఎన్ పేట, ఎక్స్ ప్రెస్ న్యూస్, సెప్టెంబర్ 13:

ఎల్ ఎన్ పేట మండలం  బసవరాజుపేట గ్రామం లో సమూహకంగా జిల్లేడు ద్రావణం తయారు చేయడం జరిగింది. ఇందులో ముఖ్యoగా 10 లీటర్ల నాటు ఆవు మూత్రం, 20 కేజీ ల జిల్లేడు ఆకులు( ఆకులను కచ్చ పచ్చ గా దంచి ), 200 లీటర్ల నీటిలో 3 రోజులు మురగబెట్టి న తరువాత ఈ జిల్లేడు ద్రావణం తయారు  అవుతుంది. ఈ జిల్లేడు ద్రావణం వరిలో పోటాష్ లోపాన్ని నివారించవచ్చు అలాగే రసం పీల్చు పురుగు నివారణకు కూడా వాడొచ్చని  ఇంచార్జి బి. లలిత గారు వివరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో B.రామరావు, S. ఆనంద్,  అప్పారావు , సంజీవ్ రావు, రైతులు, ఏపీ సీ ఎన్ అఫ్ సిబ్బంది పాల్గొన్నారు.

Name*
Email*
Comment*