వందే భార‌త్‌లు మ‌రిన్ని

9/13/2024 10:31:22 PM

- విశాఖ మీదుగా కూడా

ఢిల్లీ; 
ఇప్పటికే దేశవ్యాప్తంగా పలు వందే భారత్ రైళ్ళు పట్టాలపై దూసుకుపోతున్నాయి. ఇటీవల భారత ప్రధాని నరేంద్ర మోడీ మూడు కొత్త వందే భారత్ రైళ్లను ప్రారంభించారు. మీరట్ నుండి లక్నోకు, మధురై నుండి బెంగళూరుకు, చెన్నై నుండి నాగర్ కోయిల్ లను కలుపుతూ ఈ రైల్వే సర్వీసులు ప్రారంభమయ్యాయి.  వందే భారత్ రైళ్లను పెంచాలని, హాల్టింగ్ పాయింట్లను కూడా పెంచాలని ప్రధానంగా డిమాండ్ వినిపిస్తుంది. దేశంలో అనేక ప్రాంతాలలో వందే భారత్ రైళ్ల అవసరాన్ని గుర్తించిన రైల్వే శాఖ మరికొన్ని రూట్లలో కొత్త వందే భారత్ రైళ్లను సిద్ధం చేసింది. త్వరలోనే మరో 10 వందే భారత్ రైళ్లు రైల్వే ప్రగతికి బాటలు వెయ్యనున్నాయి. సెప్టెంబర్ 15వ తేదీన భారత ప్రధాని నరేంద్ర మోదీ మరో 10 వందే భారత్ రైళ్లను ప్రారంభించి ప్రయాణికులకు అంకితం చేయనున్నారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్ విధానంలో ఈ రైళ్లను ప్రారంభించనున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించే 10 నూతన వందే భారత రైలు ఆయా మార్గాలలో రైల్వే కనెక్టివిటీని మరింత పెంచనున్నాయి.

ఈ రూట్లలోనే...

టాటా నగర్ - పాట్నా, వారణాసి - దియోఘర్, దుర్గ్ - విశాఖపట్నం, రాంచి - గొడ్డ, టాటా నగర్ - బెర్హంపూర్ , రూర్కెలా - హౌరా, హౌరా - భాగల్పూర్, ఆగ్రా - వారణాసి, హుబ్లీ - పూణే, నాగపూర్ - సికింద్రాబాద్ రూట్లలో మరింత రైల్వే కనెక్టివిటీని ఇవి విస్తరించనున్నాయి. రైల్వే వ్యవస్థను ఆధునికీకరించే క్రమంలో ప్రవేశపెడుతున్న ఈ కొత్త వందే భారత్ రైళ్లు దేశవ్యాప్తంగా భారీ సంఖ్యలో విస్తరిస్తూ ఉండడం రైల్వే ప్రగతిలో హై స్పీడ్ రైళ్ల దూకుడుకు అద్దం పడుతుంది.

Name*
Email*
Comment*