విరగకాసిన కాఫీ తోటలు

9/17/2024 6:57:17 PM

జికే వీధి - ఎక్స్ ప్రెస్ న్యూస్, సెప్టెంబర్, 17 : 
మన్యంలో ఈ ఏడాది మార్చి నుంచి జూలై వరకు కురిసిన భారీ వర్షాలు కారణంగా కాఫీ తోటలకు అనుకూలంగా మారాయి. అందువలన కాఫీ తోటలు విరగ్కాశాయి పంట కొంచెం తొందరగా చేతికి వస్తుందని ఆశిస్తున్నారు. ఏజెన్సీలో గల 11 మండల్లో గల విస్తారమైన కాఫీ తోటలు సుమారు మూడు లక్షల ఎకరాల్లో కాఫీ తోటలు ఉన్నాయి. వీటి ద్వారా సుమారు 80000 టన్నుల కాఫీ పండ్లు దిగబడి వస్తుందని అంచనా వేస్తున్నారు. వాటిని ప్రాసెస్ చేస్తే సుమారు 20వేల టన్నులు పార్చ్మెంట్ కాఫీ ఉత్పత్తి అయ్యే అవకాశం ఉందని రైతులు ఆనంద వ్యక్తం చేస్తున్నారు. దీనితోపాటు రేటు కూడా అనుకూలంగా ఉంటే రైతులకు ఆదాయం ఎంతో బాగుంటుందని ఆశిస్తున్నారు.

Name*
Email*
Comment*