విద్యార్థి కనిపించడం లేదని ఫిర్యాదు

9/17/2024 8:38:56 PM

చింతపల్లి-ఎక్స్ ప్రెస్ న్యూస్:
 మండలంలోని చింతపల్లి బాయ్స్-2 జి టి డబ్ల్యూ ఏ ఎస్ పదవ తరగతి చదువుతున్న విద్యార్థి కించే భీమరాజు ఈనెల 10వ తారీఖు నుంచి కనిపించడం లేదని విద్యార్థి తండ్రి కించే వీరన్న ఫిర్యాదు చేసినట్టుగా చింతపల్లి పోలీస్ అధికారి ఒక ప్రకటనలో తెలియజేశారు. విద్యార్థి తండ్రికించే వీరన్న కథనం ప్రకారం జి. మాడుగుల మండలం పాల మామిడి పంచాయతీ సీకులు 100 గ్రామానికి చెందిన తన కుమారుడు కించే భీమన్న చింతపల్లి ఓ టి డబ్ల్యూ ఏ పాఠశాలలో పదవ తరగతి చదువుతున్నాడు. ఆరోగ్యం బాలేదని గత నెల 24న పాఠశాల ఉపాధ్యాయుల వద్ద సెలవు తీసుకుని ఇంటికి వచ్చారు. తర్వాత ఈ నెల 10న పాఠశాలకు వెళ్తానని చెప్పి తన వద్ద 500 రూపాయలు తీసుకున్నడని, కానీ పాఠశాలకు వెళ్లకుండా గారెలగడ్డ గ్రామం లోగల తన అత్త సీతమ్మ ఇంటికి వెళ్లినట్లు తెలిపారు. ఆ మరునాడు చింతపల్లి పాత బస్టాండ్ వద్ద తన మేనమామకు జన్మదిన నేలకంఠంకు కనిపించినట్లుగా తెలిసినందున తనమేన మామ పాఠశాలకు తనను మామతో పాఠశాలకు వెళ్తున్నానని చెప్పిన విద్యార్థి పాఠశాలకు వెళ్లకుండా ఎటో వెళ్లిపోయాడు. ఈ సంగతి తెలుసుకొని ప్రధానోపాధ్యాయులకు ఈ విషయాన్ని తెలియజేశామని, నాటి నుంచి నేటి వరకు విద్యార్థి ఆచూకీ కోసం తరలించడం జరిగిందని, అయినప్పటికీ ఫలితం లేకపోవడంతో చింతపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశామని అన్నారు. మిస్ యు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడతామని పోలీస్ శాఖ వారు తెలియజేశారు.

Name*
Email*
Comment*