మండలంలో స్వచ్ఛతా హీ సేవా అవగాహన కార్యక్రమం

9/17/2024 8:42:41 PM

మండల పురవీధుల్లో విద్యార్థులచే ప్రజలకు అవగాహన కల్పిస్తూ భారీ ర్యాలీ. 

పరిసరాల పరిశుభ్రతతోనే సంపూర్ణ ఆరోగ్యం.

 ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలి.

స్వచ్ఛత హి సేవ కార్యక్రమం ద్వారా ప్రభుత్వం ఇచ్చే సలహా సూచనలు పాటించి దేశాభివృద్ధికి కృషి చేయాలి.

ముంచంగిపుట్టు(ఎక్స్ ప్రెస్ న్యూస్): సెప్టెంబర్ 17:
మండల కేంద్రంలో స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమం మండల అభివృద్ధి కార్యాలయ ఈవోపీఆర్డి వి చిన్నన్న ఆధ్వర్యంలో మంగళవారం మండల కేంద్రంలో గల పురవీధుల్లో భారీ ర్యాలీగా వెళ్లి అవగాహన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం నాలుగు రోడ్ల కూడలి వద్ద మానవహారంగా ఏర్పడిన సందర్భంగా ఎంపీపీ అరిసెలు సీతమ్మ మాట్లాడుతూ  కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ఈ నెల 17వ తేదీ నుండి అక్టోబర్2 తేదీ వరకు ప్రతి గ్రామంలో స్వచ్ఛత హి సేవ కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. స్వచ్ఛత హి సేవ కార్యక్రమంలో భాగంగా ప్రతి ఒక్కరు వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని గృహాల పరిసరాల పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఆమె అన్నారు.
స్వచ్ఛత హి సేవ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు పాటించి అవగాహన కలిగి ఉండాలని ఆమె అన్నారు.  పరిసరాలలో ఎక్కడపడితే అక్కడ చెత్తచెదారాలు వేయరాదని బహిరంగ ప్రదేశాల్లో చెత్తను పారబోయకుండా చెత్తకుండీలోనే చెత్తను వేయాలని ప్రతి ఒక్కరూ పరిశుభ్రత పాటించి నప్పుడే ఆరోగ్యంగా ఉండవచ్చు అన్నారు. మహాత్మా గాంధీ కేవలం స్వాతంత్రమునే కాకుండా స్వచ్ఛమైన భారతదేశ అభివృద్ధిని ఆకాంక్షించారని ఆమె గుర్తు చేశారు.  స్వచ్ఛ ఆంధ్ర ప్రదేశ్ సాధించి స్వచ్ఛభారత్ సాధించే లక్ష్యంతో ప్రతి ఒక్కరు స్వచ్ఛత హి సేవ  అవగాహన కలిగి ఉండాలని ఆమె పిలుపునిచ్చారు. 
అనంతరం స్వచ్ఛత బాధికారి, సంపూర్ణ స్వచ్చత, మాస్ క్లీనింగ్, ఆక్టివిటీస్, సఫాయిమిత్ర సురక్ష, నినాదాలతో ప్రతిజ్ఞ చేశారు. సానిటేషన్ కిట్లు అందించడం జరుగుతుందని వాటిని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలన్నారు.  ఈ కార్యక్రమంలో వెలుగు ఏపీఎం సిహెచ్ కళావతి ఏపీవో సంఘం నాయుడు స్థానిక పంచాయతీ కార్యదర్శి గోపి కార్యదర్శులు సింహాచలం, సోమేశ్వరరావు, మండల అభివృద్ధి కార్యాలయ సిబ్బంది, గ్రామ సచివాలయ సిబ్బంది, బాలూర పాఠశాల 2 విద్యార్థులు పాల్గొన్నారు.

Name*
Email*
Comment*