ఏనుగురాయి, బూసిపుట్టు, పంచాయితీ కేంద్రంలలో స్వచ్ఛతా హీ సేవ అవగాహన ర్యాలీ

9/17/2024 8:44:53 PM


ముంచంగిపుట్టు(ఎక్స్ ప్రెస్ న్యూస్): సెప్టెంబర్ 17:

మండలంలో స్వచ్ఛతా హీ సేవ 2024 కార్యక్రమంకేంద్ర ప్రభుత్వం పిలుపుమేరకు మండల పరిధిలో గల ఏనుగురాయి పంచాయతీలో మంగళవారం స్థానిక సర్పంచ్ నర్సింగ్ రావు ఆధ్వర్యంలో విద్యార్థులతో భారీ ర్యాలీ వెళ్లి అవగాహన కార్యక్రమం నిర్వహించారు. అలాగే మారుమూల బూసిపుట్టు పంచాయతీ కేంద్రంలో సర్పంచ్ కె రాజులమ్మ గ్రామ సచివాలయ సిబ్బంది, ఆధ్వర్యంలో విద్యార్థిని విద్యార్థులతో మంగళవారం జరిగిన వారపు సంతలో భారీ అవగాహన ర్యాలీ నిర్వహించి ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్వచ్ఛ తా హి సేవ కార్యక్రమం సెప్టెంబర్ 17 నుండి అక్టోబర్ 2 వరకు నిర్వహిస్తామన్నారు.  పంచాయతీ పరిధిలోగల గ్రామాల ప్రజలు గృహాల చుట్టూ పరిసరాల పరిశుభ్రత పాటించాలని ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాలని తెలియజేశారు. పంచాయితీ పరిధి గ్రామాలలో రహదారులు శుభ్రం చేశారు. వ్యక్తిగత పరిశుభ్రత ప్రతి ఒక్కరి అవసరమన్నారు.  మనకు మనమే పరిశుభ్రంగా ఉంటూ మన కుటుంబాన్ని పరిశుభ్రంగా ఉంచుకుంటూ  చుట్టూ ఉండే పరిసరాలను కూడా పరిశుభ్రంగా చూసుకోవాలి. 
స్వచ్ఛ తా హి సేవా కార్యక్రమం విధిగా ప్రతి ఒక్కరు పాటించాలని దానిని ఆచరించాలని తెలిపారు. రానున్న 15 రోజులు ప్రతి ఒక్కరూ ఈ యొక్క స్వచ్ఛత హి సేవ కార్యక్రమాన్ని దృష్టిలో పెట్టుకొని మన చుట్టూ ఉండే పరిసరాలు, చెత్తాచెదారాలను తొలగిస్తూ, మన ఇంట్లో ఉన్న చెత్తను బహిరంగ ప్రదేశాల్లో పడేయకుండా రహదారులు పరిశుభ్ర పరచి మన ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సచివాలయ సిబ్బంది, ఏనుగురాయి కార్యదర్శిలు సింహాద్రి, టీ బోల్నాద్, మహిళా పోలీస్ గంగాభవాని, సుభాషిని, హెల్త్ సెక్రటరీ, ఎల్ అనిత కుమారి, వెల్ఫేర్ అసిస్టెంట్, వెంకటలక్ష్మి, వెటర్నరీ అసిస్టెంట్, వెంకటరాజు, ఇంజనీరింగ్ అసిస్టెంట్, బాబ్జి, సర్వేయర్, వీరయ్య, అంగన్వాడీ టీచర్, ఈశ్వరి, ఉషశ్రీ,ఆశా కార్యకర్తలు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Name*
Email*
Comment*