మోదీ నాయకత్వంలో అగ్రరాజ్యాల సరసన భారత్

9/17/2024 9:00:01 PM

- బీచ్ క్లీనింగ్ లో పాల్గొన్న మాజీ మంత్రి భీమిలి ఎమ్మెల్యేగంటా.

- విజయవాడ వరదల్లో సేవలందించిన పారిశుద్ధ్య సిబ్బందికి సత్కారం.

మధురవాడ జోన్ టు: ఎక్స్ ప్రెస్ న్యూస్: 
అత్యంత శక్తిమంతమైన దేశంగా భారత దేశాన్ని అగ్ర రాజ్యాల సరసన నిలబెట్టిన ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో దేశం మరింత పురోభివృద్ధి సాధిస్తుందని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అన్నారు. దేశంలో ఒక ఉద్యమంలా సాగుతున్న మోడీ స్వచ్చ భారత్ ఆలోచనను ప్రతి ఒక్కరూ నిత్య జీవితంలో ఒక భాగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. మంగళవారం మోడీ పుట్టినరోజు సందర్భంగా సాగర్ నగర్ బీచ్ లో జీవీఎంసీ ఆధ్వర్యంలో మంగళవారం జరిగిన స్వచ్చ భారత్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవడం ద్వారా ఆరోగ్యకరమైన సమాజాన్ని నిర్మించుకోవచ్చని తెలిపారు. అలాగే మోడీ చొరవతో అంతర్జాతీయ యోగా దినోత్సవానికి ప్రాచుర్యం లభించిందన్నారు. స్వచ్చ భారత్ వంటి పరిశుభ్రత కార్యక్రమాలు మొక్కుబడిగా కాకుండా నిరంతరం జరగాలని చెప్పారు. విశాఖ - భోగాపురం మధ్యనున్న 45 కిలోమీటర్లు బీచ్ అభివృద్ధికి ప్రణాళిక రూపొందించామని పేర్కొన్నారు. బీచ్ లో ఎంటర్ టైన్మెంట్ జోన్లు, చిల్డ్రన్ ప్లే ఏరియాలు, ఈటర్స్ జోన్స్ తదితరాలను తొందర్లోనే కార్యరూపంలోకి తీసుకు రానున్నామని వివరించారు. విజయవాడ వరదల్లో 11 రోజుల పాటు ప్రతికూల పరిస్థితుల్లో పని చేసిన 250 మంది జీవీఎంసీ పారిశుద్ధ్య సిబ్బంది నిజమైన హీరోలుగా అభివర్ణించారు. వారందరినీ గంటా శాలువాలు కప్పి సత్కరించారు. అనంతరం బీచ్ లో శుభ్రత కార్యక్రమాన్ని చేపట్టారు. కార్యక్రమంలో జీవీఎంసీ జోనల్ కమిషనర్ శైలజా వల్లి, కూటమి నాయకులు కోరాడ రాజబాబు, పంచకర్ల సందీప్, శాఖారి శ్రీనివాస్, నొడగల అప్పారావు, గాడు చిన్ని కుమారి, చెట్టిపల్లి గోపీ, గాడు అప్పలనాయుడు, వై.జీవన్ కుమార్, మొల్లి లక్ష్మణరావు, గంటా నూకరాజు, బి.ఆర్.బి. నాయుడు, చందక  అప్పలరాజు తదితరులు పాల్గొన్నారు.

Name*
Email*
Comment*