అగనంపూడి లో స్వచ్ఛతా హీ సేవా

9/17/2024 9:02:17 PM


అగనంపూడి, ఎక్స్ ప్రెస్ న్యూస్, సెప్టెంబర్ 17:

     స్టీల్ యాజమాన్యం ఆధ్వర్యంలో స్వచ్ఛత హీ సేవ అగనంపూడి లో నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా అగనంపూడి జనరల్ ఆసుపత్రి రోడ్డు చెక్ పోస్ట్ దారిలో, ఏలేరు బ్రిడ్జి వద్ద, శనివాడ డస్ట్ బిన్ వద్ద ఉన్న చెత్తను ఉక్కు జీఎం ( టౌన్ అడ్మిన్) ఎస్ బి  దాస్ ఆధ్వర్యంలో టౌన్ అడ్మిన్ అధికారులు, ఏ డి సి చైర్మన్ బలిరెడ్డి సత్యనారాయణ చెత్త ను ఎత్తి లారీ లలో తరలించారు. అనంతరం ఎస్ బి దాస్ మాట్లాడుతూ సెప్టెంబర్ 14వ తేదీ నుండి అక్టోబర్ ఒకటో తేదీ వరకు ఉక్కునగరం స్టీల్ ప్లాంట్ లో డిపార్ట్మెంట్లో, బీసీ గేటు వద్ద షెడ్యూలు ప్రకారం స్వచ్ఛహి సేవా కార్యక్రమం స్వచ్ఛందంగా కార్మికులు అధికారులు పాల్గొని కార్యక్రమాన్ని చేయడం జరుగుతుందని, కార్యక్రమంలో భాగంగా మంగళవారం అగనంపూడి ఏరియాలో చేయడం జరిగిందని, ఈ కార్యక్రమం ప్రతి సంవత్సరం చేయడం జరుగుతుందనీ అన్నారు. ప్రజలు స్వచ్ఛత హి సేవ కార్యక్రమంలో భాగంగా ప్రజలు చైతన్యవంతులై మన ప్రాంతాలు పరిశుభ్రంగా ఉంచాలని కోరారు.
ఏ డి సి చైర్మన్ బలిరెడ్డి సత్యనారాయణ మాట్లాడుతూ శనివాడ దగ్గర డస్ట్ బిన్ స్టీల్ ప్లాంట్ టౌన్ అడ్మిన్ వారు కట్టించడం జరిగిందని ఇక్కడ చెత్తను స్టీల్ ప్లాంట్ వారే తీసుకెళ్లడం జరుగుతుందని కావున అగనంపూడి వాసులు చెత్తను డస్ట్ బిన్ లో మాత్రమే వేయాలని, బయట పడేయడంతో ప్రమాదాలకు నిలయంగా ఆ ప్రాంతం మారిందన్నారు. ఏలేరు బ్రిడ్జి వద్ద కూడా చెత్తను వేయకుండా డస్ట్ బిన్ లో ఇయ్యాలని కోరారు. ఉక్కు నగరం టౌన్ అడ్మిన్ అధికారి బి సింహాద్రి సభా దక్షిణ జరిగిన కార్యక్రమంలో టౌన్ అడ్మిన్ అధికారులు సత్య, దాస్,  వరప్రసాద్, జనరల్ ఫోర్ మెన్ పెదిరెడ్ల హరినాథ్ అగనంపూడి దివ్య జ్యోతి భవన్ ఇంచార్జ్ బి కే రామకృష్ణ తదితరులు  పాల్గొన్నారు.

Name*
Email*
Comment*