ఘనంగా శ్రీ భగవాన్ విశ్వకర్మ యజ్ఞ పూజ మహోత్సవం

9/17/2024 9:06:18 PM

 కొమ్మాది: ఎక్స్ ప్రెస్ న్యూస్: సెప్టెంబర్ 17:-
జీవీఎంసీ ఐదోవార్డు కొమ్మాది దరి కొలువైన శ్రీ శ్రీ శ్రీ భగవాన్ విశ్వకర్మ జయంతి సందర్బంగా యజ్ఞ, పూజ మహోత్సవంలు సిద్ధాంతి లాక్కొజు ఒంకార్ ఆచార్య ఆధ్వర్యంలో మధురవాడ శ్రీ విశ్వకర్మ భగవాన్ కార్పెంటర్ కళాకారుల సంఘం సహకారంతో... మంగళవారం అత్యంత ఘనంగా, కన్నులపండుగ గా జరిగాయి. ఆచార్య సిద్ధాంతి...స్వామి వారికీ సహస్ర నామార్చనం, మహానివేదనం, మహా మంత్రాపుష్పము తో విశ్వకర్మ మహా యజ్ఞం ప్రారంభయించారు. అనంతరం, హోమం పూర్ణహుతి, మహాదాశీర్వచనం తో యజ్ఞాన్ని పరిపూర్ణం చేసారు. ఈ సందర్బంగా కార్పెంటర్ సంఘం ఆధ్వర్యంలో...విశాఖ ఎంపీ భరత్ చేతుల మీదుగా మహా అన్నసమారాధన జరిగింది. ఈ వేడుకలుకు మధురవాడ, కొమ్మాది, మారికవలస గ్రామ ప్రజలు, భక్తులు తండోప తండాలుగా హాజరై  స్వామివారి ప్రసాదం స్వీకరించారు.
 ఈ కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు,విశాఖ ఎంపీ మతుకుమిల్లి భరత్ ముఖ్య అధితులుగా హాజరై స్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్బంగా ఎం పి భారత్ సంఘ విశ్వకర్మ కార్మికులకు ఉచిత ప్రమాద, జీవిత భీమా కల్పిస్తానని హామీ ఇచ్చారు. అలానే భీమిలి జనసేన నాయకుడు సందీప్ పంచకర్ల, భీమిలి టిడిపి నాయకుడు కోరాడ రాజబాబు, 5, 7,8 13,38 కార్పొరేటర్లు హేమలత, పిళ్ళా మంగమ్మ, లొడగల అప్పారావు తరపున లొడగల రామ్మోహన్ రావు, కెల్లా సునీత,గోడీ విజయలక్ష్మి, టిడిపి ఇన్చార్జి చిక్కాల విజయబాబు, విశ్వబ్రాహ్మణ ఫెడరేషన్ డైరెక్టర్ గోడి నరసింహాచారి, టిడిపి నాయకులు మొల్లి లక్ష్మణరావు,పిళ్లా వెంకట్రావు నాగోతి సత్యనారాయణ, పిళ్లా నరసింహారావు, జనసేన నాయకులు దేవర శివ,నాగోతి నరసింహా నాయుడు, టిడిపి ఆరో వార్డు అధ్యక్షుడు  దాసరి శ్రీను, ఉమ్మడి కూటమి నాయకులు,కార్యకర్తలు మరియూ ఈ కార్యక్రమాని నిర్వహిస్తున్నవారు గిరిజాల పార్వతీశం విశ్వకర్మ భగవాన్ సేవా సంఘం విశాఖ జిల్లా కార్యదర్శి,  స్టీరింగ్ కమిటీ సభ్యులైన కురుమోజు గోవిందరావు, శ్రీమంతుల వీరాచారి, గోలి సతీష్,మండా రమేష్,కొమ్మోజి చిన్న, కొత్తల శ్రీనివాసరావు, సాంబాన గౌరీ, కేశన కుర్తి కృష్ణచారి, రామోజీ, పాండురంగ,కేసనకుర్తి అప్లాచారి,కలిగిట్ల సత్యనారాయణ, రాయవలస అప్పల చారి,తాళాబత్తుల సత్తిబాబు,లంకలపల్లి కృష్ణ చారి, వేముల ఈశ్వరరావు,ఆవుపాటి శ్రీను దమ్ము రాజు, మధురవాడ శ్రీ విశ్వకర్మ  భగవాన్ కార్పెంటర్ కళాకారులు పాల్గొన్నారు.

Name*
Email*
Comment*