ఎల్జీ పాలిమర్స్ బాధిత కుటుంబాలకు నష్టపరిహారం అందేలా చూస్తాం

9/17/2024 9:13:29 PM

”కూటమి ప్రభుత్వం ద్వారా

ఎన్ఏడి: ఎక్స్ ప్రెస్ న్యూస్: సెప్టెంబర్ 17: 
జీవీఎంసీ పశ్చిమ నియోజకవర్గం ఎల్జి పాలిమర్స్ వెంకటాపురం 2020 లో ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీక్ ఘటనకు చెందిన ఎంతోమంది బాధితులు నష్టపోవడం జరిగింది అదేవిధంగా ఇప్పుడు ఆ బాధితులకు అదనపు పరిహారం అందించేందుకు ముందుకొచ్చిన యాజమాన్యం. ఈ మేరకు కలెక్టరేట్ లో ఎల్జీ పాలిమర్స్ నష్ట పరిహారం పై ఎంపీ భరత్, కలెక్టర్ హరేందిర ప్రసాద్, ఎమ్మెల్యే గణబాబు, ఎల్ జి సంస్థ ప్రతినిధులతో మంగళవారం భేటీ అయ్యారు. ఇందులో భాగంగా విశాఖ పశ్చిమ నియోజకవర్గం  శాసనసభ్యులు ఎమ్మెల్యే గణబాబు మాట్లాడుతూ గతంలో ఎల్జి ఫార్మర్స్ గ్యాస్ లీకు ఘటనలో ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు అదేవిధంగా నిరాశ్రయులయ్యారు అని అన్నారు అంతేకాకుండా ఎల్ జి పాలిమర్స్ ప్రమాదంలో పరిశ్రమ చుట్టుపక్కల ఉన్న సామాన్య ప్రజలు తీవ్రంగా నష్టపోయారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎల్ జి పాలిమర్స్ బాధితులకు న్యాయం చేసే విధంగా చర్యలు చేపడుతుంది. కొరియా ప్రతినిధులు సీఎం చంద్రబాబు నాయుడు కలవడానికి వచ్చినప్పుడు ఎల్ జి పాలిమర్స్ బాధితులకు న్యాయం చేయాలని కోరారు. బాధిత గ్రామాల ప్రజలు అనారోగ్య సమస్యలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గత వైసిపి ప్రభుత్వం ఎల్జి పాలిమర్స్ బాధిత గ్రామాల ప్రజలకు ఇచ్చిన హామీలను లేకపోయింది అని ఎద్దేవా చేశారు. ఎల్జి పాలిమర్స్ బాధిత గ్రామ ప్రజలకు విద్య, వైద్యం పాటు సురక్షిత మంచినీటిని అందిస్తామ అని అన్నారు.

Name*
Email*
Comment*