భాష్యం స్కూల్ విద్యార్థులకు మాదకద్రవ్యాలపై అవగాహన సదస్సు

9/18/2024 9:36:21 PM


ఎన్ఏడి: ఎక్స్ ప్రెస్ న్యూస్: సెప్టెంబర్ 18:
 భాష్యం హైస్కూల్లో ప్రిన్సిపల్ కే .మణికంఠ రెడ్డి, వైస్ ప్రిన్సిపాల్ బి.రమేష్ అనుమతితో మాదగ ద్రవ్యాల పై అవగాహన సదస్సు బుధవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆర్పీఎఫ్ ఎస్ ఐ. మమతా, ఏ.ఎస్.ఐ. కె.ఆర్.కె రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పిల్లలందరూ బుద్ధిగా చదువుకోవాలని. మీలో కలెక్టర్, డాక్టర్లు, లాయర్లు పోలీసులు, ఇంజనీర్లు, ప్రభుత్వ అధికారులుగా ఎదగాలని అన్నారు. ముఖ్యంగా పిల్లలు చెడు మార్గం ఎంచుకోకూడదని అన్నారు. అదేవిధంగా  మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని.క్రమశిక్షణతో పిల్లలు ఎదగాలని తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని సూచించారు. ప్రభుత్వ ఆస్తులను అలాగే ఆకతాయితనముతో సుదూర దూరాలకు  ప్రయాణించే రైలు పైన రాళ్లు కూడా విసురుతూ ఉంటారని అన్నారు. అటువంటి పనులు చేయకూడదని. విద్యార్థులకు తెలిపారు. అంతేకాకుండా ఈ మధ్యకాలంలో ఆకతాయితనముతో రైల్వే స్టేషన్లో ఆగి ఉన్న ట్రైన్ అద్దాలు ధ్వంసం చేయడం జరిగింది. అలాంటి పనులు చేయకుండా సత్ప్రవర్తనతో  కలిగి ఉండాలని అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ముఖ్యంగా ఈ సదస్సులో విద్యార్థులకు రైల్వే హెల్ప్ లైన్ నెంబర్ 139 గురించి వివరించారు. స్కూల్లో సుమారు 300 మంది విద్యార్థులు అదేవిధంగా మర్రిపాలెం ఆర్పిఎఫ్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Name*
Email*
Comment*