ఎన్టీఆర్ ఇళ్లకు త్వరలో బిల్లులు చెల్లింపు

9/18/2024 10:00:45 PM

గత వైసిపి హయంలో స్థానిక మాజీ మంత్రి అప్పలరాజు కి, గ్రామాల్లో ఉన్న  వైసిపి నాయకులకి ఇళ్ల లబ్ధిదారుల బిల్లులో కొంత కమిషన్ అందేది.
తెదేపా ప్రభుత్వ హయాంలో చేపట్టిన ఎన్టీఆర్ ఇళ్ల నిర్మాణాలకు వైకాపా ప్రభుత్వం కక్షపూరితంగా బిల్లులు చెల్లించలేదు. 
గోవిందపురం పంచాయతీలో  వివిధ దశల్లో పూర్తయిన ఇళ్లకు బిల్లులు రూపొందించి, ఆన్లైన్లో పొందుపర్చినా.. ఉద్దేశపూర్వకంగా నిధులు విడుదల అడ్డుకున్న వైసిపి నేత.

పూండి: ఎక్స్ ప్రెస్ న్యూస్:
తెదేపా ప్రభుత్వ హయాంలో చేపట్టిన ఎన్టీఆర్ ఇళ్ల నిర్మాణాలకు వైకాపా ప్రభుత్వం కక్షపూరితంగా బిల్లులు చెల్లించలేదు, అని గోవిందపురం మాజీ పి.హెచ్.సి ఛైర్మన్ పుచ్చ ఈశ్వరరావు మరియు వజ్రపుకొత్తూరు మండల టీడీపీ ప్రధాన కార్యదర్శి కర్ని రమణ అన్నారు. పలాస ఎమ్మెల్యే గౌతు శిరీషమ్మ  ఆదేశాలతో గత టీడీపీ ప్రభుత్వంలో గోవిందపురం పంచాయతీలో ఎన్టీఆర్ ఇళ్ల నిర్మాణం చేపట్టి, బిల్లులు పడని సుమారు 40 మంది లబ్ధిదారులతో కృష్ణార్జున కార్యాలయంలో బుధవారం సచివాలయ సిబ్బందితో కలిసి రివ్యూ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. 
ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ గత టీడీపీ ప్రభుత్వంలో నాలుగు దశల్లో ఇళ్ల నిర్మాణాలకు బిల్లులు ఇచ్చేవారు. పునాది పూర్తయిన వెంటనే గతంలో బిల్లు వచ్చేది. దీంతో తదుపరి దశకు వెళ్లేవారు. నూరు శాతం పనులు పూర్తయిన వెంటనే మొత్తం బిల్లు దశల వారీగా చెల్లించేవారు. వైకాపా ప్రభుత్వం వచ్చే నాటికి నాటికి పునాదులు పూర్తయి, బిల్లు ఆప్లోడ్ చేసినా సొమ్ముఇవ్వలేదు అని గత తెదేపా ప్రభుత్వ హయాంలో 2016-17 నుంచి 2019-20 వరకు గ్రామాల్లో సొంత స్థలాలున్న లబ్ధిదారులకు గృహ నిర్మాణ సంస్థ ద్వారా ఎన్టీఆర్ హౌసింగ్ పేరుతో వేల సంఖ్యలో ఇళ్లు మంజూరు చేశారు. 2019-20 నాటికి ఇళ్లకు ఇప్పటికీ బిల్లులు పెండింగ్లో ఉన్నాయి. గత వైకాపా అయిదేళ్ల పాలనలో బిల్లులు చెల్లించలేదు. కూటమి ప్రభుత్వం వచ్చాక ఆయా బిల్లులపై కదలిక వచ్చింది.  బిల్లులు పెండింగ్లో ఉన్న ఇళ్ల ప్రస్తుత పరిస్థితి పై క్షేత్రస్థాయిలో సర్వే చెయ్యడం జరుగుతుంది అని, గత తెదేపా హయాంలో నిర్మించిన ఇళ్లను గ్రామ సచివాలయ ఇంజినీరింగ్ అసిస్టెంట్, హౌసింగ్ అధికారులు, సిబ్బంది క్షేత్రస్థాయికి స్వయంగా లబ్ధిదారులు ఇంటిని పరిశీలించి తాజా పరిస్థితిని ప్రత్యేక యాప్లో నమోదు చేసిన తరువాత పెండింగ్ బిల్లులు విడుదల అవుతాయి అని తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో వార్డ్ నెంబర్ గణేష్, ఎస్ఎంసి కో ఆప్షన్ సభ్యులు విఘ్నేష్, టీడీపీ సీనియర్ నాయకులు నారాయణ, కామేష్ , ఇంజనీర్ అసిస్టెంట్ సంతు, ఎన్టీఆర్ ఇళ్ల లబ్ధిదారులు మరియు కృష్ణార్జున టీం సభ్యులు సారథి తదితరులు పాల్గొన్నారు.

Name*
Email*
Comment*