అక్రమంగా నిల్వ చేసిన ఇసుకను సీజ్ చేసిన తహసిల్దార్

9/18/2024 10:10:19 PM


ఎల్ఎన్ పేట, ఎక్స్ ప్రెస్ న్యూస్, సెప్టెంబర్ 18: 
లక్ష్మీ నర్సు పేట మండలంలో పెద్ద కొల్లివలస గ్రామ సచివాలయం ఆవరణంలో అక్రమంగా నిల్వ చేసిన ఇసుకను సీజ్ చేసిన తహసిల్దార్ వై వి పద్మావతి. వంశధార పునరావాస కాలనీ సమీపనా సచివాలయం ఆవరణంలో కొంతమంది ఇసుకాసురులు అక్రమ  సంపాదనకు అలవాటు పడి ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టే విధంగా వంశధార నది నుండి అక్రమంగా ఇసుక తరలించి నిల్వచేసి లారీలు ద్వారా విక్రయించి అక్రమ సంపాదనకు అలవాటు పడ్డారని గ్రామస్తులు చెప్పారు. ఈరోజు మధ్యాహ్నం ఎల్ ఎన్ పేట మండల తహసిల్దార్ కు ఫిర్యాదు అందగా వెంటనే స్పందించిన తహసిల్దార్ రెవెన్యూ సిబ్బందితో మెరుపు దాడి చేసి  నిల్వచేసిన ఇసుక ఉన్న ప్రదేశాన్ని గుర్తించి సీజ్ చేసి కేసు బుక్ చేయడం జరిగింది. సీజ్ చేసిన ఇసుకను ఎవరు నిల్వ చేశారని ఇంకా వివరాలు రావాల్సి ఉంది. ఈ కార్యక్రమంలో ఉప తహసిల్దార్ షరీఫ్,  విఆర్వోలు రామప్పడు తదితరులు పాల్గొన్నారు.

Name*
Email*
Comment*