కొండముచ్చులు దాడుల్లో పదిమందికి గాయాలు

9/18/2024 10:17:59 PM


 రక్షణ కల్పించాలని గ్రామస్తులు డిమాండ్

 సమస్య తీవ్రతను అధికారులకు చేరవేసిన ఢిల్లీరావు

సోంపేట: ఎక్స్ ప్రెస్ న్యూస్: సెప్టెంబర్ 18
సోంపేట మండలం మాకన్నపురం పంచాయతీ శారదాపురంలో గత కొద్ది రోజులుగా గ్రామస్తులపై కొండముచ్చులు దాడి చేసి తీవ్రంగా గాయపరుస్తున్నాయి. దాడుల్లో పదిమంది వరకు గాయాలపాలయినట్లు గ్రామ ప్రజలు చెప్పారు. ఈ దాడుల్లో గాయపడిన అనేకమంది క్షతగాత్రులు పలాస, బారువ, సోంపేట, హరిపురం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. గ్రామానికి చెందిన బతకల శాంతమ్మ , తీవ్రంగా గాయపడి పలాస ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగ , కోరికాన చిరంజీవి ,కోరికాన రాములమ్మలో హరిపురం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ దాడుల్లో గాయపడిన పొట్నూర్ లక్ష్మీనారాయణ మందస ఆసుపత్రిలో పిన్నింటి పాపమ్మ ,పొందరు జగదీష్ నక్క గుండమ్మ, బాలాజీ ,తదితరులకు చేతులు కాలిపై కొండముచ్చులు విచక్షణారహితంగా గోల్లతో రక్కి వేయడంతో తీవ్రంగా గాయపడ్డారు.  సమాచారం తెలుసుకున్న బీసీ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బీన ఢిల్లీ రావు గ్రామంలో పరిస్థితిని ప్రత్యక్షంగా చూసి అటవీ శాఖ అధికారులకు ఫోన్ ద్వారా సమాచారం అందించి తక్షణమే రక్షణ చర్యలు చేపట్టాలని కోరారు. కొండముచ్చులు పట్టుకొని వెళ్లేందుకు రాజమండ్రి నుంచి ఓ బృందం రావాల్సి ఉంటుందని సంబంధిత అటవీశాఖ అధికారి తెలిపారని ,అటవీశాఖ అధికారులు సకాలంలో చర్యలు తీసుకోవడంలో విఫలమవుతున్నారని దీంతో బాధితులు ఆస్పత్రిలో చికిత్స కోసం లక్షల రూపాయలు వెచ్చించాల్సిన  దుస్థితి ఏర్పడిందని  ఢిల్లీరావు , గజ్జి ఢిల్లీ లు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు పాలకులు తక్షణమే స్పందించి కొండముచ్చుల నుంచి గ్రామస్తులకు రక్షణ కల్పించాలని బాదితులు తలుపు వారు డిమాండ్ చేశారు. బుధవారం అటవీశాఖ అధికారులు స్థానిక సర్పంచ్ మద్దిల నాగేశ్వరరావు తో కలిసి బాధితులను పరామర్శించి వివరాలు సేకరించారు. ఉన్నతాధికారులు ధృష్టికి తీసుకెళ్లి రక్షణ కల్పించి ,బాధితులకు న్యాయం చేస్తామని భరోసా ఇచ్చారు.

Name*
Email*
Comment*