కుళ్ళిన గుడ్డు నిజమే .... కానీ ?

9/18/2024 10:20:38 PM

ఎంపీడీవో అలా! ఎంఇఓ ఇలా !
ఏది నిజం !

సోంపేట: ఎక్స్ ప్రెస్ న్యూస్: సెప్టెంబర్ 18

  అది సోంపేట బాలికోన్నత పాఠశాల మధ్యాహ్నం భోజన పథకం  అమలవుతుంది. విద్యార్థులకు పంపిణీ చేయడానికి గుడ్లు సిద్ధంగా ఉన్నాయి. అవి నల్లగా ఉండి దుర్వాసన వస్తున్నాయి. ఇదే సందర్భంలో సోంపేట ఎంపీడీవో వెంకటరమణ పాఠశాల పరిశీలినకు మంగళవారం వెల్లారు. విద్యార్థులకు  పంపిణీ చేసేందుకు సిద్ధంగా ఉంచిన గుడ్లును పరిశీలించారు. ఆ గుడ్లు తినడానికి వీలుగాలేని  నల్లగా ఉన్నాయని  ఈ సందర్భంగా వంట నిర్వాహకులపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఆయన ఇందుకు సంబంధించిన ఫోటోలను స్థానిక విలేకరులకు షేర్ చేశారు. ఈ వార్త అన్ని పత్రికల్లో బుధవారం ప్రచురితమైంది. వార్తా కథనాలపై జిల్లా విద్యాశాఖాధికారి స్పందించి స్థానికంగా ఉన్న మండల విద్యాశాఖ అధికారి జోరాడు విచారణ నిమిత్తం బుధవారం పాఠశాలకు పంపించారు. వంట నిర్వాహకులు, పాఠశాల హెచ్ ఎం దామోదరరావు ,గుడ్లు సరఫరా చేసిన వ్యక్తిని విచారించారు. ఈ విచారణ లో అవి కుళ్లిన గుడ్లు కావని ,పారేసేందుకు సిధ్దంగా ఉంచిన సమయంలో ఎంపిడివో పరిశీలించారని ,పిల్లలకు నాణ్యమైన గుడ్లే ఇస్తున్నామని హెచ్ ఎం వివరణ ఇచ్చినట్టు ఎంఇఓ స్థానిక విలేకరులకు సమాచారం ఇచ్చారు.చర్యలు నిమిత్తం నివేదిక డిఇఓ కు  పంపినట్లు ఎంఇఓ చెప్పారు. ఇందులో ఎవరిది నిజమో! ఆ గుడ్లు అక్కడ ఎందుకు ఉన్నాయో ఆ అధికారులే చెప్పాలని ,విద్యార్థులు తల్లి తండ్రులు కోరుతున్నారు.

Name*
Email*
Comment*