మద్యం ధర రూ 99

9/18/2024 10:31:00 PM


- ప్రయివేటుకే అప్ప‌గింత‌
- ప్రీమియం ఔట్‌లెట్ల‌కు అనుమ‌తి
- ఏపీ మంత్రివ‌ర్గం నిర్ణ‌యం

అమ‌రావ‌తి, ఎక్స్‌ప్రెస్ న్యూస్‌; 
మద్యం పాలసీకి ఆమోదం ఏపి మంత్రివర్గ సమావేశంలో నూతన ఎక్సైజ్ పాలసీకి ఆమోద ముద్ర వేసారు. ఇక నుంచి ప్రయివేటు వ్యక్తులకే మద్యం దుకాణాల నిర్వహణ అప్పగించాలని తుది నిర్ణ‌యానికి వ‌చ్చారు. 
రాష్ట్రంలో నాణ్యమైన మద్యం అందిస్తూనే క్వార్టర్ ధర సగటున రూ 99గా ఉండాలని  ఏపీ మంత్రివర్గం నిర్ణయించింది .  ఏపీ మంత్రివర్గం పలు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపింది. దాదాపు నాలుగు గంటలు జరిగిన సమావేశంలో ఏపీలో నూతన మద్యం పాలసీకి మంత్రివర్గం ఆమోద ముద్ర వేసింది.  గతంలో ఉన్న విధంగానే అన్ని రకాల బ్రాండ్ల మద్యం అమ్మకాలను అనుమతించనున్నారు. కొత్త మద్యం పాలసీకి అనుగుణంగా మద్యం దుకాణాలను రెండు మూడు రోజుల్లో నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. ప్రీమియర్ ఓట్ లెట్స్ ను ప్రారంభించనున్నారు. నాణ్యమైన మద్యం క్వార్టర్ సగటున రూ 99గా ఉండాలని మంత్రివర్గంలో నిర్ణయం తీసుకున్నారు. 

వ‌లంటీర్ల‌పై చ‌ర్చ‌...

 వాలంటీర్ల వ్యవస్థ కొనసాగింపు పైన మంత్రివర్గ సమావేశంలో సుదీర్ఘంగా చర్చించారు. అధికారంలోకి వస్తే వాలంటీర్లకు రూ 10 వేలు గౌరవ వేతనంగా ఇస్తామని ఇచ్చిన హామీ పైన చర్చించారు. అయితే, ప్రస్తుతం ఉన్న వాలంటీర్లలో అవసరం మేర కొనసాగించాలని..అందులోనూ వారికి స్కిల్స్ శిక్షణ ఇవ్వటం ద్వారా ప్రయోజనం ఉంటుందనే అభిప్రాయం వ్యక్తం అయింది. ప్రజా సమస్యలు పరిష్కారం రాజీనామా చేసిన వాలంటీర్ల ను తిరిగి తీసుకోవటం పైన భిన్నాభిప్రాయాలు వ్యక్తం అయినట్లు సమాచారం. వరదల్లో పంట నష్టం జరిగిన ప్రాంతాల్లో కైలు చేసిన వారికే సాయం అందించాలని డిసైడ్ అయ్యారు. ప్రజాదర్బార్ కు వస్తున్న ఫిర్యాదులను సంబంధిత శాఖలకు పంపాలని..మంత్రులు వాటి పరిష్కారానికి ప్రత్యేక శ్రద్ద తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు. త్వరలో జిల్లా ఇంఛార్జ్ మంత్రులను నియమిస్తామని వెల్లడించారు. వరదల సమయంలో బాగా పని చేసిన మంత్రులను సీఎం అభినందించారు.

Name*
Email*
Comment*