ఉత్తరాంధ్రపై చిన్న‌చూపేలా

9/18/2024 10:33:16 PM


- సీఎం ప‌ర్య‌ట‌న ఎందుకు వాయిదా ప‌డుతోంది
- తొలుత ఇటు వ‌స్తామ‌ని గోదావ‌రి జిల్లాల వైపు వెళ్లారు

 విశాఖ‌ప‌ట్నం, ఎక్స్‌ప్రెస్ న్యూస్‌;  
సరిగ్గా వారం క్రితం వాయుగుండం ఉత్తరాంధ్ర జిల్లాలను అల్లల్లాడించింది. మూడు రోజుల పాటు అతి భారీ వర్షాలతో ఉత్తరాంధ్ర చిగురుటాకులా వణికింది. చేతికి అంది వచ్చే పంటలన్నీ వరద నీటిలో కొట్టుకుని పోయాయి. వాగులు వంకలు పొంగి బాధిత జనం బావురుమన్నారు. ఉత్తరాంధ్రకు చేకూరిన నష్టానికి ఓదార్పు ఇస్తూ బాధితులను పరామర్శించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు వస్తున్నారు అని నాలుగు రోజుల క్రితం ప్రచారం సాగింది. ఉత్తరాంధ్ర టూర్ కాస్తా గోదావరి జిల్లాలకు మళ్ళింది. ఆ తరువాత అయినా ఇటు వైపు వస్తారని అనుకున్నారు. కానీ ముఖ్యమంత్రి పర్యటన మీద అధికారిక సమాచారం ఇప్పటి వరకు లేదు. దాంతో చంద్రబాబు ఉత్తరాంధ్ర కు వస్తారా రారా అన్న దాని మీద అంతా తర్కించుకుంటున్నారు. మిగిలిన ప్రాంతాలతో సరిసమానంగా ఉత్తరాంధ్ర నష్టపోయింది. పెద్ద కష్టమే వచ్చి పడిందని అంతా ఆందోళన చెందుతున్నారు. ముఖ్యమంత్రి వచ్చి తగిన సహాయం మీద ప్రకటన ఇస్తే ఊరట పొందవచ్చు అనుకున్న వారు అంతా నిరాశ చెందుతున్నారు. ఈ స‌మ‌యంలో  మరో అల్పపీడనం కూడా ఉత్తరాంధ్ర మీద పడగ విప్ప‌డానికి సిద్ధంగా ఉంది. 

అధికారులు అంచ‌నా వేసే అవ‌కాశం ఉంది...
ఉత్తరాంధ్ర పర్యటన బాబు చేస్తే అధికారులు కూడా నష్టాలను అంచనా కట్టే విషయంలో వేగవంతంగా ప్రక్రియ స్టార్ట్ చేస్తారు అని అంటున్నారు. మొత్తానికి మొత్తం అన్ని సీట్లు టీడీపీ కూటమికి సమర్పించుకున్న ఉత్తరాంధ్రను అలా వదిలేస్తారా లేక బాబు టూర్ ఉంటుందా అన్నదే చూడాలని అంటున్నారు.

Name*
Email*
Comment*