మాజీ సైనికులకు ప్రత్యేక కార్పొరేషన్ ప్రకటనపై హర్షం

9/18/2024 10:44:57 PM


- కేంద్ర పౌర విమానయాన శాఖామంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు
- సైనికులు, వారి కుటుంబాలకు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని వెళ్లడి
- తన ఎన్నికల మేనిఫెస్టో 'జవాన్ డిక్లరేషన్' లో సైతం ప్రత్యేక కార్పొరేషన్ హామీ ఇచ్చినట్లు గుర్తు చేసిన కేంద్ర మంత్రి

శ్రీకాకుళం, ఎక్స్ ప్రెస్ న్యూస్; 
దేశం కోసం సరిహద్దుల్లో, ఎన్నో క్లిష్టమైన పరిస్థితుల్లో సేవలందిస్తున్న సైనికులు, మాజీ సైనికుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని కేంద్ర పౌర విమానయాన శాఖామంత్రి కింజరాపు రామ్మోహన్ స్పష్టం చేశారు. మాజీ సైనికులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని ఆంధ్రప్రదేశ్ కేబినెట్ బుధవారం తీసుకున్న నిర్ణయంపై ఆయన హర్షం వ్యక్తం చేస్తూ ప్రకటన విడుదల చేశారు. సైనికుల కుటుంబాలకు భరోసా నిలిచేలా జవాన్ మిత్ర అనే వినూత్న కార్యక్రమాన్ని చేపట్టిన విషయాన్ని గుర్తు చేశారు. అలాగే జవాన్లకు మద్దతుగా నిలిచేలా దేశంలోనే తొలిసారిగా జవాన్ డిక్లరేషన్ ప్రకటించామన్నారు. సిక్కోలు జిల్లాకు చెందిన మాజీ సైనిక సంఘం(16 విభాగాలు)తో ఈనెల 15న నిర్వహించిన ప్రత్యేక భేటీలో సైతం ప్రత్యేక కార్పొరేషన్ పట్ల స్పష్టమైన హామీ ఇచ్చామని తెలిపారు. రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ సైతం తన యువగళం పాదయాత్రలో ఇచ్చిన మాట నిలబెట్టుకునేలా.. సీఎం చంద్రబాబు సారధ్యంలో మంత్రివర్గం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటుకు ఆమోదం తెలపడంపై ఆనందంగా ఉందన్నారు. దేశం కోసం సేవ చేస్తున్న సైనికులకు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏ విధమైన ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుందో ఈ నిర్ణయమే తెలియజేస్తున్నారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సభ్యులకు కేంద్రమంత్రి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేయడంతో పాటు జవాన్లకు మరింత మద్దతుగా ఉంటామని భరోసా ఇచ్చారు.

Name*
Email*
Comment*