పైడిభీమావరం చెక్ పోస్టును తనిఖీ

9/18/2024 10:45:59 PM


*ఇతర విభాగాల సమన్వయంతో అక్రమ రవాణాను పూర్తిస్థాయిలో అరికట్టాలి

* ఎస్పీ కేవీ మహేశ్వర రెడ్డి 

శ్రీకాకుళం, ఎక్స్ ప్రెస్ న్యూస్; 
ఇతర విభాగాల సమన్వయంతో సరిహద్దు చెక్ పోస్టు వద్ద విస్తృతంగా తనిఖీలు నిర్వహించి అక్రమ రవాణాను పూర్తిస్థాయిలో అరికట్టాలని జిల్లా ఎస్పీ  కేవీ మహేశ్వర రెడ్డి  పోలీస్ అధికారులు ఆదేశించారు. జిల్లా ఎస్పీ  కేవీ మహేశ్వర రెడ్డి  బుధవారం సాయంత్రం జె.ఆర్.పురం పోలీసు స్టేషన్ పరిధిలో ఉన్న అంతర్ జిల్లాల సరిహద్దు గల పైడిభీమావరం చెక్ పోస్టును తనిఖీ చేశారు. ఈ క్రమంలో జాతీయ రహదారిపై వాహనాలు రాకపోకలు ట్రాఫిక్ తదితర అంశాలను క్షుణ్నంగా పరిశీలించి అధికారులతో మాట్లాడుతూ అదనపు సిబ్బంది,అన్ని విభాగాల అధికారులు,సిబ్బందితో సమన్వయం చేసుకుంటూ పకడ్బందీగా వాహనాలు తనిఖీలు నిర్వహించాలని మద్యం, గంజాయి, ఇసుక అక్రమ రవాణాతో పాటు ఇతర అక్రమ రవాణాను నియంత్రించే విధంగా క్షేత్ర స్థాయిలో తనిఖీలు నిర్వహించాలని సూచించారు. సిబ్బంది ప్రతి ఒక్కరు అప్రమత్తంగా ఉంటూ 24 గంటల పాటు ప్రతి వాహనాన్ని తరవుగా తనిఖీ చేయాలన్నారు.ఇందులో భాగంగా పైడ్ భీమవరం వద్దనున్న ప్రత్యేక పోలీస్ అవుట్ పోస్టును తనిఖీ చేశారు.

జె ఆర్ పురం సుర్కిల్ కార్యాలయం సందర్శనం

సర్కిల్ కార్యాలయంలో ఉన్న ముఖ్యమైన రికార్డులు నిర్వహణ,కేసులు దర్యాప్తు వివరాలుపై జిల్లా ఎస్పీ ఆరా తీశారు. ప్రతిరోజు ఉదయం సాయంత్రం విజిబుల్ పోలీసింగ్ లో భాగంగా వాహనాలను  తనిఖీలు చేపట్టి మధ్యం, గంజాయి అక్రమ రవాణాను అరికట్టాలని సూచించారు. ప్రమాదాల నివారణకు రోడ్డు భద్రతా నియమాలు, పాటించవలసిన నిబంధనలపై వాహన చోదకులకు విస్తృతంగా అవగాహన కల్పించి, ద్విచక్ర వాహన చోదకులు ప్రతి ఒక్కరు హెల్మెట్ ధరించే విధంగా చూడాలన్నారు. రోడ్డు భద్రత నియమాలు ఉల్లంఘించిన వారిపై జరీమానలు విధిస్తూ ప్రతి ఒక్కరు భద్రత నియమాలు పాటించే విధంగా చర్యలు చేపట్టాలని సూచించారు.
జిల్లా ఎస్పీ  వెంట డిఎస్పీ వివేకానంద్, సిఐలు అవతారం,ఈమైనాల్ రాజు, ఎస్సై చిరంజీవి ఉన్నారు.

Name*
Email*
Comment*